నాటుకోళ్లను తినొద్దు! నెల రోజుల వరకు పాలు తాగవద్దు?
Publish Date:May 11, 2020
Advertisement
స్టెరీన్ గ్యాస్ ను పీల్చిన గేదెల నుంచి తీసే పాలను నెల రోజుల వరకు తాగవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశువులు ఆ గాలి పీల్చడంతో కడుపులో ఇంకా పాలిమర్ నిక్షేపాలు ఉంటాయి. అందుకే వాటి పాలు అసలు తాగవద్దని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో వున్న గేదె, ఆవు పాలు తాగితే ఊపిరితిత్తులు, చర్మం పై దద్దుర్లు, తలనొప్పి, వికారం, వాంతులు, ఆయాసం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పశువులకు అక్కడి గడ్డిని సైతం మేతగా వేయవద్దంటున్నారు పశు వైద్యులు. అక్కడ పెంచుకునే నాటుకోళ్లను తినొద్దట. వాటి శరీరంలోకి విషవాయువు వెళుతుందని..వాటి మాంసం తినడం వల్ల దుష్పప్రభావాలు వస్తాయని చెబుతున్నారు బయో సెంటిస్టులు. మేక, పొట్టేలు వంటి వాటి మాంసాన్ని తినరాదు. ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఇబ్బంది పడక తప్పదు. పశువులకు అక్కడ పంట పొలాల్లో పైరుగా వేసిన జొన్న లేక చొప్ప. పిల్లి పెసర, మొక్కజొన్న వంటి గడ్డి జాతిని గానీ ఎండుగడ్డిని గానీ మేతగా వేయవద్దంటున్నారు పశువుల డాక్టర్లు. వాతావరణం అంతా పూర్తిగా కలుషితమైంది. పాలిమర్ రూపంలో స్టెరీన్ నిక్షేపాలు సూక్ష్మ ధాతువులుగా ఉండిపోయాయి. మరికొద్ది రోజుల వరకు దాని ప్రభావం ఉంటోంది. పూర్తిగా ఆ ప్రాంతాన్ని స్టెరిలైజ్ చేస్తే తప్ప యధాతథ స్థితికి రాదు. ఇళ్ల పై పెద్ద మొత్తంలో నీరు చల్లడంతో పాటు రసాయానాలతో ఇళ్లను శుద్ది చేస్తేనే అక్కడకు వెళ్లే వీలుంది. అప్పటి వరకు శిబిరాల్లోనే ప్రజలు ఉండాలి. హడావుడిగా శిబిరాల నుంచి వారిని ఇళ్లకు పంపితే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
http://www.teluguone.com/news/content/vizag-lg-polymers-gas-leak-effect-25-99020.html





