Publish Date:Feb 25, 2012
విశాఖజిల్లా: విశాఖజిల్లా నర్సీపట్నంలో పంచాయితీరాజ్ శాఖ అధికారులు మంత్రి బాలరాజు సేవలో తరిస్తున్నారు. ఆయన స్థలానికి రాజమార్గాన్ని నిర్మించేందుకు మార్గం సుగమం చేసి విధేయతను చాటుకున్నారు. లక్షలాది రూపాయల ఆర్టీసీ స్థలాన్ని కొనుగోలుచేసి రహదారి నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంత్రిగారి స్థలానికి వెళ్ళే దారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులొస్తాయని భావించి అడ్డుగా ఉన్న ఆర్టీసీ స్థలాన్ని అడ్డగోలు రేటుకు కొనుగోలుచేసి రహదారి నిర్మిస్తున్నారు.
మంత్రి బాలరాజుకు నర్సీపట్నం ఆర్టీసీ డిపోను ఆనుకుని సుమారు 18సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలానికి వెళ్ళేముందు సన్నని రోడ్డు ఉంది. ఆర్టీసీ స్థలానికిగల ప్రహరీ కారణంగా ఈ రహదారి సన్నగా ఉంది. గతంలో ఈ స్థలాల్ని కొనుగోలుచేసిన మంత్రి అధికారంలో లేక పోవడంతో రహదారిని వెడల్పు చేసుకోలేకపోయారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీనిపై దృష్టి సారించారు. పంచాయితీరాజ్ శాఖను రంగంలోకి దించారు. ఈ శాఖ ఆర్టీసీ స్థలాన్ని చౌకగా కొనేసి మంత్రిగారి స్థలానికి వెళ్ళే మార్గాన్ని వెడల్పుచేసే పనిలో తలమునకలై ఉంది. ఈ రహదారిని సిమెంట్ రోడ్డుగా మార్చేందుకు సైతం ప్రణాళికను సిద్దం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/visaakhapatnam-24-12186.html
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో సోమవారం నాడు అసాధారణ వాతావరణం నెలకొంది.
తెలంగాణలో ధరణి, భూభారతి భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కొడంగల్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.!
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష విధించింది.
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!