Publish Date:Jan 18, 2025
కోట్లాది మంది భక్తులు భక్తితో కొలిచే దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి. ఆ స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అత్యంత పవిత్రమైన తిరుమలలో ఇటీవల తరచుగా కొన్ని అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల కొండపై నియమాలు, కట్టుబాట్లు, నిబంధనల మేరకు మాంసం, మద్యం, మత్తు పదార్థాలను తిరుమల కొండపై నిషేధం. అయితే జగన్ హయాంలో వీటన్నిటికీ తిలోదకాలిచ్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆగమశాస్త్ర విరుద్ధంగా తిరుమల కొండ పవిత్రతను మంటగలిపేలా జగన్ హయాంలో పలు కార్యక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.
తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలలో అపచారాలకు అవకాశం లేకుండా పోయిందని అంతా భావించారు. కానీ తాజాగా తిరుమల కొండపై మరో అపచారం చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన 28 మంది భక్త బృందం శుక్రవారం (జనవరి 17) తిరుమల కొండకు వచ్చింది. అలిపిరి ఘాట్ మార్గం గుండా వీరంతా కొండపైకి చేరుకున్నారు. వారు తెలిసో తెలియకో తమ వెంట కోడిగుడ్ల కూడ, పలావ్ తెచ్చుకున్నారు. అలిపిరి వద్ద భద్రతా వైఫల్యాం కారణంగానే వారు తిరు మలపైకి ఆ పదార్ధాలతో చేరుగలిగారనడంలో సందేహం లేదు. ఓ పెద్ద గిన్నెలో కోడిగుడ్ల కూర, పలావ్ తో వచ్చిన వారు కొండపై రాంబగీచ గెస్ట్ హౌస్ సమీపంలోని బస్టాండ్ పార్కింగ్ స్థలంలో వాటిని తింటూ కనిపించారు. ఇది గమనించిన మిగిలిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వారిని అదుపులోనికి తీసుున్నారు. తిరుమల నిబంధనల గురించి తమకు తెలియదని చెప్పారు.
ఈ సంఘటనతో టీటీడీలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. అలాగే కోడిగుడ్ల కూరతో కొండపైకి వచ్చిన వారంతా అన్యమతస్థులు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీటీడీలో భద్రతా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/violation-of-sanctity-in-tirumala-39-191484.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.