రేవంత్ కేబినెట్ లోకి విజయశాంతి?

Publish Date:Mar 10, 2025

Advertisement

తెలుగు సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి, తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందారు. అటువంటి విజయశాంతికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలను పార్టీ అధిష్ఠానం నిర్ణయం దిగ్భ్రమకు గురి చేసిందనడంలో సందేహం లేదు. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి ఆ ఎన్నికలలో కానీ, ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కానీ విజయశాంతి రాష్ట్ర కాంగ్రెస్ తరఫున పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. సరే ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ హై కమాండ్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రమేయం లేదు.

అసలు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఆమె పేరును ఎవరూ సిఫారసు కూడా చేయలేదు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన సందర్భంలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఠాక్రే అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ దక్కిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాలలో జోరుగా సాగుతోంది. సరే మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ నేతల సిఫారసు లేకుండా, అసలిక్కడి నేతలతో సంబంధం లేకుండా విజయశాంతి పేరును నేరుగా అధిష్ఠానమే ఖరారు చేసింది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ లో ఓ కొత్త చర్చకు తెరలేచింది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత జరగనున్న రేవంత్ కేబినెట్ విస్తరణలో విజయశాంతికి బెర్త్ కన్ఫర్మ్ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇందుకు కారణంగా వారు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు దీటుగా బదులిచ్చే నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ లో    చాలా తక్కువగా ఉన్నారనీ, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ వినా కేటీఆర్, హరీష్ ల విమర్శలకు దీటుగా బదులిస్తున్న దాఖలాలు లేవనీ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేబినెట్ లో విజయశాంతి వంటి ఫైర్ బ్రాండ్ లీడర్ అవసరమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నదని చెబుతున్నారు.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.