వైవీ ఫ్యామిలీపై బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి

Publish Date:Mar 13, 2025

Advertisement

కాకినాడ పోర్టు వాటాల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సీఐడీ అధికారులు విచారించారు. విచారణలో సాయిరెడ్డి ఎవరిని ఇరికిస్తారో అని వైసీపీ పెద్దలు భయపడుతూ వచ్చారు.. అనుకున్నట్లు గానే ఆయన జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించే వైవీ సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు విక్రాంత్‌రెడ్డిపై బాంబులు పేల్చారు. పోర్టు వ్యవహారంలో కీలక పాత్ర విక్రాంత్‌రెడ్డిదే అని విచారణలో వెల్లడించినట్లు సాయిరెడ్డే స్వయంగా చెప్పడం విశేషం. ఆ క్రమంలో విచారణ తర్వాత ఆయన జగన్ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యాలు, జగన్ కోటరీని టార్గెట్ చేసిన తీరు వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసు లో ఏపీ సీఐడీ అధికారులు  మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కి నోటీసులు ఇచ్చారు. నోటీసులో పేర్కొన్న ప్రకారం విజయవాడ సిఐడీ రీజనల్ కార్యాలయం లో సాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు. అప్పుడు వాటాల్లో పాత్రధారులు, సూత్రధారులపై విజయసాయి రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. 

సీఐడీ కార్యాలయంలోకి విజయసాయి రెడ్డి మినహా ఇంకా ఎవరినీ అధికారులు లోపలకు అనుమతించలేదు. న్యాయవాదులకు కూడా అనుమతి లేదన్నారు. విజయసాయి రెడ్డి చెప్పే సమాధానాలపై వైసీపీ కీలక నేతల గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. విచారణలో ఏం చెబుతారోనని వైసీపీ నేతలు బెంబేలెత్తిపోయారు. ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి అనుకున్నట్లే కాకినాడ పోర్టు వాటాల కేసులో బాంబు పేల్చారు.

కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్‌ అధిపతి కేవీ రావును బెదిరించి అక్రమంగా వాటాలను తీసుకున్నారన్న అభియోగాలతో విజయసాయిపై కేసు నమోదైంది. కేవీ రావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐడీ.. వైసీపీ నేత సుబ్బారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్ రెడ్డితో పాటు విజయసాయిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డిని ఏ-2గా, శరత్‌చంద్రారెడ్డి ఏ3గా ఉన్నారు. ఈ కేసులో ఈడీ కూడా కొన్నాళ్ల కిందట విజయసాయిని విచారించింది. 

తాజాగా సీఐడీ విచారణలో కేవీ రావుతో వైవీ సుబ్బారెడ్డికి ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. వైవీ విక్రాంత్‌రెడ్డిని కేవీరావుకి తాను పరిచయం చేసానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ విక్రాంత్‌ రెడ్డేనని తేల్చి చెప్పారు. ఆ విషయాన్ని విచారణ తర్వాత సాయిరెడ్డి స్వయంగా మీడియాకి వివరించి వైసీపీ నేతల్ని ఉలిక్కి పడేలా చేశారు.

ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేయటంపై విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  జగన్‌ చుట్టూ కోటరీ ఉందని.. ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ పేర్కొన్నారు. జగన్‌ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్‌కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.  జగన్‌ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలని తీవ్ర విమర్శలు చేశారు.

జగన్ కోటరీని  ద్వితీయ శ్రేణి నాయకులతో పోల్చిన సాయిరెడ్డి... ఆ ద్వితీయ శ్రేణి నేతలే తనకూ, జగన్‌కి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి, జగన్‌మోహన్‌రెడ్డి మనసు విరిచే ప్రయత్నం చేసి, విజయం సాధించారని సాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల పాటు పార్టీలో అవమానాలు పాలయ్యానని.. తను దిగిన ప్రతి మెట్టు ఇంకొకరు పైకి ఎక్కడానికి ఉపయోగపడిందని జగన్ కోటరీ నేతల్ని దెప్పిపొడిచారు.  దీంట్లో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని వ్యాఖ్యానించారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కూడా విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్‌2గా వెలుగొందారు. పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా చక్రం తిప్పారు. అయితే ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెరిగిందో జగన్ ఆయన్ని పక్కన పెడుతూ వచ్చారు. సజ్జలతో పాటు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మాటే జగన్‌ దగ్గర చెల్లుబాటు అయ్యేదంటారు. ఆ ముగ్గురే జగన్ కోటరీగా ఫోకస్ అయ్యారు. ఆ క్రమంలో కాకినాడ పోర్టు వాటాల కేసులో వైవీ సుబ్బారెడ్డిని డైరెక్ట్‌గా ఇరికిస్తున్న విజయసాయిరెడ్డి.. జగన్ కోటరీని ఆ స్థాయిలో టార్గెట్ చేస్తుండటం వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి తన భవిష్యత్తుపై విజయసాయిరెడ్డి చేసిన సూచనలను జగన్ పాటిస్తారో లేదో చూడాలి

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.