విజయ్ ప్రమాణ స్వీకారం.. ముహూర్త బలం ఎలా ఉందంటే?

Publish Date:May 10, 2026

Advertisement

బేసిగ్గా అష్టమి, నవములు కష్టమి రోజులని అంటారు. మే 10, ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకార ముహుర్తం.. సెంటిమెంటు ప్రకారం ఇది నవమి. మరి ఆయన జాతకానికి జ్యోతిష పరంగా ఎలాంటి ఆటంకాలు ఏర్పడుతాయి? అసలే సంకీర్ణ ప్రభుత్వం, దీన్నిఆయనకున్న జాతక బలం ఎలా హ్యాండిల్ చేస్తుంది?

సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు.  నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది. ఇందుకు పరిహారమేంటో చూస్తే..  ఒకవేళ అభిజిత్ లగ్నంలో అంటే, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో.. ప్రమాణ స్వీకారం చేస్తే కొన్ని దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుందని చెబుతారు.

మే 10 ఆదివారం కావడం విజయ్‌కు ఒక రకంగా కలిసి వచ్చే అంశం. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు అధికారానికి, ప్రభుత్వానికి కారకుడు. ఆదివారం రోజు అధికారం చేపట్టడం వల్ల ఆయనకు వ్యక్తిగతంగా ఒక రకమైన తేజస్సు.. నిర్ణయాధికారం లభిస్తుంది. జాతక బలం చూస్తే విజయ్ జాతకంలో రవి, కుజుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయన పుట్టిన తేదీ.. జూన్ 22, మిథున రాశి/కర్కాటక లగ్నం ప్రకారం చూస్తే.. ఇది ఆయనకు ప్రజల్లో ఉండే ఇమేజ్‌ను కాపాడుతుంది. 

సంకీర్ణ ప్రభుత్వం వర్సెస్  జాతక బలం అంశం పరిశీలిస్తే.. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం అనేది ఓ సాహసం లాంటిదే. ఇందుకు శని, గురు గ్రహాల బలం చాలా అవసరం. ఇక సవాళ్లు ఎలా ఉంటాయో చూస్తే.. సంకీర్ణంలో భాగస్వాములు పదే పదే బ్లాక్ మెయిల్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ముహూర్తంలో దోషం ఉంటే, ప్రభుత్వం పూర్తి కాలం అంటూ ఐదేళ్లు   సాగడంపై నీలినీడలు కమ్ముకునేలా ఉందని జ్యోతిష్య పండితులు అంటున్నారు.  విజయ్ జాతకంలో గజకేసరి యోగం వంటివి ఉంటే..  ఆయన తన వాగ్ధాటితో, ప్రజాకర్షణతో సంక్షోభాలను ఎదుర్కోగలరు. కానీ.. శని ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం మిత్రపక్షాల వల్ల మానసిక ఒత్తిడి తప్పదు.

మే 2026 నాటికి గురువు మిథున రాశిలో, లేదా కర్కాటకంలోనో సంచరించే అవకాశం ఉంది. ఇది విజయ్‌కు రాజకీయంగా గౌరవాన్నిస్తుంది కానీ, రాహు, కేతువుల సంచారం వల్ల సొంత పార్టీలోనే అంతర్గత కుట్రలు లేదా నమ్మకద్రోహాలు జరిగే అవకాశం ఉంది. ఇక ముహూర్త బలం సంగతి చూస్తే..  ఉదయం 10 గంటల సమయం అనేది సాధారణంగా వృషభ లేదా మిథున లగ్నం అయ్యే అవకాశం ఉంటుంది. లగ్నంలో శుభ గ్రహాలు ఉంటేనే ఈ సంకీర్ణ ప్రభుత్వం సాఫీగా సాగుతుంది.

విజయ్ ఒక విక్రమార్కుడి లాగా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారు. అయితే..   సంకీర్ణ ప్రభుత్వం అనేది పూలపాన్పు కాదు. జ్యోతిష్య రీత్యా నవమి తిథిని ఎంచుకోవడం ఆయన ధైర్యానికి నిదర్శనమో లేక గ్రహబలంపై ఉన్న నమ్మకమో తెలియదు కానీ, ముహూర్త బలంతో పోలిస్తే ఆయన ప్రజా బలం, వ్యక్తిగత జాతక బలం మాత్రమే ఈ సంకీర్ణాన్ని నెట్టుకురావడానికి తోడ్పడాలి. శత్రువుల నుంచి.. ముఖ్యంగా పాత రాజకీయ శక్తుల నుంచి.. ఆయనకు నిరంతర సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. దీనిని ఆయన తనదైన సినిమాటిక్ నాలెడ్జ్ తో హ్యాండిల్ చేస్తారా లేక  పోరాడుతూనే ఉంటారా అనేది తేలాల్సి ఉంది.

By
en-us Political News

  
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.