Indrakeeladri: కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న విరోష్‌ జంట.!

Publish Date:Oct 17, 2026

Advertisement

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు. శనివారం ఇంద్రకీలాద్రికి విచ్చేసిన వారికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆలయ చైర్మన్, ఈవో, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.సినీ ప్రముఖులు ఒక్కసారిగా ఇంద్రకీలాద్రికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. 

తమ అభిమాన నటీనటులను చూసేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగడంతో అక్కడ ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులను చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరచడంతో ఇంద్రకీలాద్రిపై సందడి నెలకొంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ డ్రామా 'రణబాలి' ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో నటి రష్మిక మందన్న ఈ మూవీ సక్సెస్ పట్ల, తన భర్త విజయ్ నటన పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన, ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

విజయ్ నటనకు తాను ఎప్పటినుంచో అభిమానినని, భవిష్యత్తులోనూ అభిమానిగానే కొనసాగుతానని ఆమె తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ సినిమా తాను పోషించిన 'జయమ్మ' పాత్ర గురించి రష్మిక ప్రత్యేకంగా ప్రస్తావించారు. "జయమ్మ.. ఆమె ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ఒక నిజమైన మహిళ ఎలా ఉండాలో, తన వాళ్ల కోసం ఎలా నిలబడాలో, వారిని ఎలా కాపాడుకోవాలో ఆ పాత్ర నాకు నేర్పింది" అని రష్మిక పేర్కొన్నారు. 

 

 

[ Vijay Deverakonda, Rashmika Mandanna,  Kanaka Durga Temple, Kanaka Durga Ammavari Temple, Ranbali movie, Indrakeeladri, Vijay Rashmika Temple Visit, Vijay Deverakonda Latest News, Rashmika Mandanna Latest News,Telugu One, Telugu news ]

By
en-us Political News

  
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
ఇంటర్నెట్ వినియోగం కేవలం పెద్దలకే పరిమితం కాదు, పిల్లలకు కూడా ఇదొక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు.. ఎన్నో ఆశలతో నిద్రలోకి జారుకున్నారు.. కానీ తెల్లవారేసరికి ఆ ఇంట్లో ఐదుగురు విగతజీవులుగా కనిపించారు
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.