ఏపీలో జగన్మాయ.. బాధితులపైనే కేసులు!

Publish Date:Feb 21, 2023

Advertisement

ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్కు.. నేను ఒకడికి ఎదురు వచ్చినా వాడికే రిస్కు.. తొక్కి పడేస్తా.. ఒక సినిమాలో డైలాగ్ ఇది. ఆ సినిమాలో హీరో మంచికి అండగా ఉంటానని చెబుతూ చెడును ఇసుమంతైనా సహించను అంటూ ఈ డైలాగ్ చెబుతాడు. కానీ ఏపీలో జగన్ పాలనలో అరాచకత్వం రాజ్యమేలుతోంది. దౌర్జన్యంతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది.   అరాచకత్వానికి ఎదురెళ్లినా, ప్రశ్నించినా తొక్కిపడేస్తా అంటూ రెచ్చిపోతోంది. 

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం.. మరో సారి అధికారంలోకి వచ్చేందుకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోయిన తరుణంలో  ప్రశ్నిస్తే దాడులు చేస్తాం.. కేసులు పెడతాం, మాకు నచ్చకపోతే పోలీసు స్టేషన్లలో మ్యాన్ హ్యాండిల్ చేస్తామంటూ చేసి చూపిస్తోంది.  పోలీసు లాకప్ లనూ అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేసింది.   ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు కేసులు, దాడుల భయాన్ని తెలుగుదేశం శ్రేణుల్లో కలిగించడం.  విపక్ష పార్టీకి మద్దతుగా నిలిచినా, మాట్లాడినా ఖబడ్దార్ అన్న వార్నింగ్ ను పరోక్షంగా ప్రజలకు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యంగా మారుతోంది.  గత ఏడాది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, ఆ తరువాత చంద్రబాబు కుప్పం పర్యటనలో జరిగిన విధ్వంసం, ఆ వెంటనే చంద్రబాబు రోడ్ షోలో ఆయనపై జరిగిన రాళ్ల దాడి... తొక్కిసలాట సాకు చూపి సభలూ, సమావేశాలపై నిషేధం.. అనపర్తిలో ఏకంగా పోలీసులే చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా కూర్చుని ఆయనను కదలనీయకుండా నిలవరించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. రాష్ట్రంలో  అధికార అరాచకత్వానికి ఎన్నో ఎన్నెన్నోఉదాహరణలు కనిపిస్తాయి.

ఇక తాజాగా గన్నవరంలో జరిగిన ఘటన పరాకాష్టగా చెప్పుకోవచ్చు.  రాష్ట్రంలో లా అండ్ అర్డర్ కాపాడాల్సిన పోలీసులే అధికార అరచకత్వాన్ని దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారా అనిపించేలా గన్నవరం ఘటన ఉంది. గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయంపై అధికార పార్టీ కార్యకర్తలు, రౌడీ షీటర్లు మూకుమ్ముడిగా దాడి చేస్తుంటే.. పోలీసులు వాళ్ల కాళ్లా వేళ్లాపడి బతిమలాడుకోవడాన్ని రాష్ట్రంలో అందరూ టీవీలలో చూశారు. దాడులను ఆపడంలో పోలీసులు విఫలమయ్యారు, సరే తరువాతైనా అదనపు బలగాలను రప్పించి దాడికి పాల్పడిన వారిని అదుపులోనికి తీసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదు. పై పెచ్చు దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపై కేసులు నమోదు చేశారు. హత్యా యత్నం నుంచి వివిధ సెక్షన్ల కింద కేసులు బనాయించారు.

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిథిని అదుపులోనికి తీసుకున్నారు. అంటే నిందితులను వదిలేసి బాధితులపై కేసులు నమోదు అయ్యాయన్న మాట. నిందితులు దాడి చేయడానికి కారణం బాధితులు వారిని రెచ్చగొట్టారని పోలీసులు చెబుతున్నారు.   రెచ్చగొట్టినందునే వారు దాడులు చేశారని టీడీపీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు.   అసలు రెచ్చగొట్టడం అంటే ఏమిటో… దాడులు చేసిన వారిని వదిలిసే.. రెచ్చగొట్టడం పేరుతో కేసులు పెట్టడం ఏమిటో ఏపీ పోలీసులకే తెలియాలని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. గన్నవరంలో దాడి తమ పనేనని వల్లభనేని వంశీ స్వయంగా ప్రకటించారు. దాడి సమయంలో తాను అక్కడే ఉన్నానంటున్నారు.  

తనను పిల్ల సైకో అన్నందుకే దాడులు చేశామని ఒప్పుకుంటున్నారు. కానీ ఇలా ఒప్పుకున్నందుకు ఆయనపై కనీసం కేసు కూడా లేదు. దాడులకు గురై వాహనాలు పోగొట్టుకున్న నేతలు మాత్రం జైల్లో ఉన్నారు. పిల్ల సైకో అన్నందుకే.. వల్లభనేని వంశీ రెచ్చిపోతే ఆయన గతంలో చంద్రబాబు, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు ఏమి చేయాలన్న ప్రశ్నకు మాత్రం పోలీసుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ సమాధానం రావడం లేదు.  ఏ పార్టీ అధికారంలో ఉన్నా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా ఉంటారు. కానీ జగన్ పాలనలో మాత్రం పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరుంటే వారే నిందితులు, దోషులు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాడులు చేసినా, దాడులకు గురైనా రిస్కు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారే తొక్కి పడేస్తాం అన్నట్లు పోలీసుల తీరు ఉంది.   

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.