గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీకల్లోతు కష్టాల్లో ఇరుకున్నట్లేనని పరిశీలకులు అంటున్నారు. వంశీ అక్రమాల, అరాచకాల గుట్టుముట్లన్నీ తెలిసిన రంగాను మూడు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించడంతో వంశీ ఆటకట్టేసినట్లునని విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి.. ఆ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ మారిన వల్లభనేని వంశీ.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా వ్యవహరించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ క్యాడర్ ను వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఆక్రమణలు, కబ్జాలు, సెటిల్ మెంట్లతో చెలరేగిపోయారు. అయితే తన అక్రమాలు, ఆక్రమణలన్నికీ తెరముందు తన అనుంగు శిష్యుడిని పెట్టి తాను తెరవేనుక బాగోతం నడిపారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అనుంగు శిష్యుడు పోలీసులకు చిక్కాడు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నంచీ పరారీలో ఉన్న వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగారావు అలియాస్ రంగా ఇటీవలే పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు రంగాను మూడు రోజుల పోలీసుల కస్టడీని అనుమతిస్తూ విజయవాడ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. దీంతో ఇక వంశీ గుట్టుమట్లన్నీ రట్టు అవ్వడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి విషయంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వంశీనేనిఅప్పట్లో తెలుగుదేశం ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో గన్నవరం తెలుగుదేశంపై దాడి విషయంలో నమోదైన కేసులో వల్లభనేని వంశీ పేరు లేదు. ఆ కేసులో వల్లభనేని ప్రధాన అనుచరుడు రంగాను ఏ1గా చేరుస్తూ కేసు నమోదైంది. అయితే అప్పట్లో అధికారంలో వైసీపీ ఉండటంతో ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు విచారణ ముందుకు సాగడం మొదలైంది.
ఆ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసులో వల్లభనేని వంశీ పేరు కూడా చేర్చారు. అయితే తెలుగుదేశం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నంచీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీ ప్రధాన అనుచరుడు రంగా పరారీలో ఉన్నారు. ఇఖ కేసులో తనను చేర్చడంతో అసలు కేసే లేకుండా చేస్తే మంచిదని భావించిన వంశీ... ఈ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. అయితే ఆ కిడ్నాప్ బెదరింపు వ్యవహారంలో వంశీ అడ్డంగా దొరికిపోయి కటకటాలు లెక్కిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన రంగాను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వంశీకి ఇక ఈ కేసులో బయటపడటానికి దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. కిడ్నాప్ కేసు, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసుతో పాటు భూ కబ్జా ఆరోపణలతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న వంశీకి.. ఇక జగన్ హయాంలో గన్నవరం ఎమ్మెల్యేగా చేసిన అరాచకాలకు సంబంధించి విషయాలన్నీ రంగా విచారణలొ వెలుగులోకి వస్తాయని పోలీసులు నమ్మకంతో ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vamshi-in-deep-trouble-39-195440.html
వివాదాస్పద లేడీ అఘోరీ చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి ని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ్రుల కు ఇంట్లో బస చేసిన అఘోరీ మాయమాటలు చెప్పి శ్రీ వర్షిణిని లోబరుచు కుంది.
ఎమ్మెల్సీగా నాగబాబు తన తొలి అధికారిక పర్యటన పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు. జనసేన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మొట్టమొదటి సారిగా అధికారికంగా పిఠాపురం నియోజకకవర్గంలో శుక్రవారం (ఏప్రిల్ 4) పర్యటించారు.
తెలంగాణ బిజెపిలో విభేధాలు ముదిరిపోతున్నాయి. హైద్రాబాద్ కు చెందిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనుకున్నదే జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లు-2024ను, 24 గంటల తేడాతో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. అర్థరాత్రి ఆమోదం పొందిన బిల్లుల జాబితాలో, వక్ఫ్ సవరణ బిల్లు-2024- (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవల్‌పమెంట్- యూఎంఈఈడీ-ఉమీద్) బిల్లు కూడా చేరింది. అవును. సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం (ఏప్రిల్ 2) అర్ధరాత్రి దాటాక లోక్‌సభ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు, గురువారం (ఏప్రిల్3) అర్థరాత్రి దాటిన తర్వాత రాజ్యసభ ఆమోదం తెలిపింది.
తెలంగాణ రాజకీయాలు ఇప్పడు ఢిల్లీ చేరుకున్నాయా? జంతర్ - మంతర్ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ రాజకీయాలకు వేదికగా మారుతున్నాయా? అంటే మంగళవారం (ఏప్రిల్ 1) దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చోటు చేసుకున్న విభిన్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
బంగ్లాదేశ్ చైనా, పాక్ లకు మద్దత్తు నిస్తున్న నేపథ్యంలో భారత ప్రధాని మోడీ బ్యాంకాక్ లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ తో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో సీఐడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ, తనపై కేసులను కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయన సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
దేశంలోనే తొలి సారిగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని ద్వారా అందించే సేవలను పెంచుతూ మరింత ప్రతిభామంతంగా తీర్చిదిద్దుతున్నది. ఈ ఏడాది జనవరి 30న ఏపీలో మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే.
ఎయిడ్స్ నియంత్రణలో గతేడాది 17 వ స్థానంలో ఉన్న ఎపి ఈ యేడు ఏడో స్థానానికి ఎగబాకింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ( న్యాకో) వివిధ రాష్ట్రాల సూచిక విడుదల చేసింది. ఎయిడ్స్ నియంత్రణలో ఎపి కనబరిచిన కృషిని న్యాకో కొనియాడింది
పూడిక తీయడానికి బావిలోకి దిగి అందులోని విషవాయువుల కారణంగా ఎనిమిది మంది మరణించిన సంఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని కొండావత్ గ్రామంలోని పురాతన బావిలో బురద పేరుకుపోవడంతో దానిని శుభ్రం చేయాలని జిల్లాయంత్రాంగం భావించింది.
కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది. బంతి దెబ్బ నుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. వైసీపీ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నతలు కర్మఫలం అనుభవించడానికి రెడీ కావలసిన పరిస్థితి ఏర్పడింది.
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి తాజాగా మరో వివాదంలో చిక్కుక్కున్నారు. నిత్యానంద స్వామి చనిపోయినట్టు ఆయన మేనల్లుడు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆస్తుల విషయంలో మేనమామతో వచ్చిన విభేధాల వల్ల మేనల్లుడు ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం (ఏఫ్రిల్ 4) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు తెలంగాణలో వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, ములుగు, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.