వల్లభనేని వంశీ ఆటకట్టేనా?

Publish Date:Apr 2, 2025

Advertisement

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని  వంశీ  పీకల్లోతు కష్టాల్లో ఇరుకున్నట్లేనని పరిశీలకులు అంటున్నారు. వంశీ అక్రమాల, అరాచకాల గుట్టుముట్లన్నీ తెలిసిన రంగాను మూడు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించడంతో వంశీ ఆటకట్టేసినట్లునని విశ్లేషిస్తున్నారు.  తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి..  ఆ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో  పార్టీ మారిన వల్లభనేని వంశీ.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా వ్యవహరించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ క్యాడర్ ను వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా  ఆక్రమణలు, కబ్జాలు, సెటిల్ మెంట్లతో చెలరేగిపోయారు. అయితే తన అక్రమాలు, ఆక్రమణలన్నికీ  తెరముందు తన అనుంగు శిష్యుడిని పెట్టి తాను తెరవేనుక బాగోతం నడిపారన్న ఆరోపణలు  చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అనుంగు శిష్యుడు పోలీసులకు చిక్కాడు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నంచీ పరారీలో ఉన్న వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగారావు అలియాస్ రంగా ఇటీవలే పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు రంగాను మూడు రోజుల పోలీసుల కస్టడీని అనుమతిస్తూ విజయవాడ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. దీంతో ఇక వంశీ గుట్టుమట్లన్నీ రట్టు అవ్వడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి విషయంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వంశీనేనిఅప్పట్లో తెలుగుదేశం ఆరోపించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో గన్నవరం తెలుగుదేశంపై దాడి విషయంలో నమోదైన కేసులో వల్లభనేని వంశీ పేరు లేదు. ఆ కేసులో వల్లభనేని ప్రధాన అనుచరుడు రంగాను ఏ1గా చేరుస్తూ కేసు నమోదైంది. అయితే అప్పట్లో అధికారంలో వైసీపీ ఉండటంతో ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు.  గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు విచారణ ముందుకు సాగడం మొదలైంది.

ఆ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసులో వల్లభనేని వంశీ పేరు కూడా చేర్చారు. అయితే తెలుగుదేశం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నంచీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీ ప్రధాన అనుచరుడు రంగా పరారీలో ఉన్నారు. ఇఖ కేసులో తనను చేర్చడంతో అసలు కేసే లేకుండా చేస్తే మంచిదని భావించిన వంశీ... ఈ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. అయితే ఆ కిడ్నాప్ బెదరింపు వ్యవహారంలో వంశీ అడ్డంగా దొరికిపోయి కటకటాలు లెక్కిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో  ప్రధాన నిందితుడైన రంగాను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వంశీకి ఇక ఈ కేసులో బయటపడటానికి దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. కిడ్నాప్ కేసు, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసుతో పాటు భూ కబ్జా ఆరోపణలతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న వంశీకి.. ఇక జగన్ హయాంలో గన్నవరం ఎమ్మెల్యేగా చేసిన అరాచకాలకు సంబంధించి విషయాలన్నీ రంగా విచారణలొ  వెలుగులోకి వస్తాయని పోలీసులు నమ్మకంతో  ఉన్నారు. 

By
en-us Political News

  
ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని వైన్స్ షాపులు ఈ నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వైన్ షాపు అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ సీపీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు.
సీఎం చంద్రబాబు చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్‌ ప్రచురించింది. పుస్తకాలను టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్‌, సీనియర్‌ పాత్రికేయులు, రచయిత విక్రమ్‌ పూల రూపొందించారు. ‘స్వర్ణాంధ్రప్రదేశ్‌ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు’ పేరుతో రెండు సంపుటాలు ప్రచురించారు.
ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం కోసం భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రూ.44 లక్షల విరాళం అందించారు. దీంతో ఈ రోజు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్‌, కర్నూలుకు చెందిన కొందరు భక్తుల నుంచి బీఆర్‌ నాయుడు అభిప్రాయాలు తెలుసుకున్నారు.
కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చేరిగారు. తెలంగాణ భవన్‌లో రాజేంద్ర నగర్ ఇంచార్జ్ ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో అత్తాపూర్ డివిజన్ నుండి శ్రీరామ్ రెడ్డి, పలు పార్టీల నేతలు చేరారు. వారంద‌రికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు తెలంగాణ ప్రజలు టెంప్ట్ అయి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారని.. ఫలితంగా తినే అన్నంలో మట్టిపోసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఎన్ని కథలు చెప్పినా ఓటర్ హైదరాబాద్ ప్రజలు వారి మాటలను నమ్మలేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మంచి చేస్తే ఎవరైనా అభినందిస్తారని.. గతంలో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులను, వారిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు బ‌ర్త్ డే సెలబ్రేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆలయాల్లో నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 కిలోల కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేసుకున్నారు.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఆర్‌టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డించారు. అతి త్వ‌ర‌లోనే 3,038 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌న్నారు.
డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్ టీవర్క్స్‌ వద్ద నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ వర్చువల్‌ సందేశం పంపారు. డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదామన్నారు. వ్యసనాలకు బానిసలై కొందరు తమ కలలను దూరం చేసుకుంటున్నారని చెప్పారు. మాదకద్రవ్యాల కట్టడిపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు అందరం అవగాహన కల్పించాలని కోరారు.
ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ 75వ పుట్టిన రోజు సందర్బంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సీబీఎన్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా చంద్రబాబునాయుడికి ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "నాన్నగారికి శుభాకాంక్షలు. నా స్ఫూర్తి నారా చంద్ర‌బాబు నాయుడు గారూ. వెరీ హ్యాపీ బ‌ర్త్ డే" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్బంగా ఈ సందర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు చంద్రబాబుకు జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షల తెలియజేశారు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి, ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి.. చేస్తున్న తీరును ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయం. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ తెలిపారు.
రేసులో పడిపోయిన ప్రతిసారీ నిలబడటమే కాదు.. పరుగెత్తి గెలవడమంటే ఆషామాషీ కాదు.. అది ఎప్పటికప్పుడు చేసి చూపిస్తున్నారు కాబట్టే చంద్రబాబుని అపర చాణక్యుడు అంటారు. చంద్రబాబు ఏజ్ బార్ అయింది.. టీడీపీ పనైపోయంది.. రాష్ట్రంలో ఇక వైసీపీకి ఎదురే లేదని జగన్ టీం తెగ హడావుడి చేసింది. అయితే సెవెన్టీ ప్లస్ ఏజ్‌లో కూడా పొలిటికల్‌గా తాను యంగ్ టర్క్‌నని నిరుపించుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (ఏప్రిల్19) శ్రీవారిని మొత్తం 78 వేల 821 మంది దర్శించుకున్నారు.
పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డులో శనివారం (ఏప్రిల్ 19)ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమ్స్ ఐదో అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
14 ఏళ్లు ముఖ్యమంత్రి.. 15 ఏళ్లు ప్రతిపక్ష నేత.. 28 ఏళ్లకే ఎమ్మెల్యే.. 30 ఏళ్ల వయసులోనే మంత్రి 45 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం.. 52 రోజులు జైల్లో పెట్టినా తొణకని.. బెణకని ధీశాలి.. జాతీయ రాజకీయాల్లోనూ ఆయనది కీలక పాత్ర .. అమరావతి రూపశిల్పి.. నవ్యాంధ్రకు సీఈఓ.. అంతర్జాతీయ స్థాయిలోనూ అపార గౌరవం నాలుగోసారి ముఖ్యమంత్రిగా పాలనతో తనదైన మార్క్ .. ఇలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.