మనిషి విలువ

Publish Date:Oct 16, 2018

Advertisement

 

తెలుసుకోవాలని ఉంది
ఒక్కసారి ఒకే ఒక్కసారి విలువ దేనికి అనేది తెలుసుకోవాలని ఉంది.

ప్రేమకా, ప్రాణానికా, మనిషికా, మనసుకా, డబ్బుకా, బలానికా, దేనికి విలువ..?

ప్రపంచంలో అన్నీ మనకే కావాలనిపిస్తుంది. అన్నీ ఉన్నాక కొన్నే లేవు అన్నీ తప్ప అనిపిస్తుంది.

ఇదే జీవితం!

నిండా మునగాలనుంది- అలా మునిగిపోతూ పక్కన ఒడ్డున నిలబడి చూడాలనీ ఉంది.. సాధ్యంకాదు..!

పోగొట్టుకుంటే రాబట్టుకోలేం... అదీ తెలుసు..!

ఆశ- వెధవ మానవ జీవితం కదండీ అలానే అనిపిస్తుంది మరి.

కట్టప్ప చంపింది కేవలం బాహుబలి పాత్రని మాత్రమే అని తెలుసు..? అయినా చిత్రాన్ని చూస్తుంటే దు.ఖం ఆగలేదండి ఈ చిన్ని ప్రాణానికి

అలాంటిది మన ప్రాణమే పోయాక లోకంతో మనకింక పనేంటీ అంటారా..! ఉందండీ..

* ఒక్కసారి నువ్వంటే ప్రాణం, నువ్వు లేకపోతే నేను లేను బంగారం అనే భర్త మాటల విలువ ప్రేమదా..?

అదే భర్త.. భార్య జీతం డబ్బులు ఓ నెల తక్కువ తెస్తే నీతో యిలా అయితే కష్టం అన్నాడంటే ఆ మాటల విలువ దేనిది..?

* నా పిల్లలే నా ప్రాణాలు అంటాం..! వాళ్లకోసమే ఈ ప్రాణాలు అంటుంటాం.. ఖరీదైన ఫోన్లు, కార్లు కొని చేతిలో పెట్టి love you కన్నా అన్నారంటే ఆ మాటల విలువ బంధానిదా..?

అదే నాన్న... పిల్లల చేతిలో జారిపోయిన ఖరీదైన ఫోన్ కోసం చావదెబ్బలు కొడితే ఆ విలువ దేనికంటారు..?

* గోరు ముద్దలు తింటూ, లాలి పాటలు వింటూ చిట్టి కథలు వింటూ పెంచి పెద్ద చేసిన అమ్మ నాది మాత్రమే అనే ఆ మాట విలువ బంధానిదా..?

అదే అమ్మ వయసు పైబడ్డాక అనారోగ్యం బారిన పడ్డాక కొడుకులు అమ్మ నీదంటే నీది అని అంటే ఆ విలువ దేనికంటారు..?

* మనం నవ్వితే నవ్వుతాడు.. ఏడుస్తుంటే ఓదారుస్తూ, గెలిస్తే భుజం తట్టి ప్రోత్సహించి ఓటమిలో ధైర్యాన్ని పంచే స్నేహితుల విలువ మనిషికా.. మనసుకా..?

ఇలా అలోచిస్తే ప్రతీ బంధం విలువా తెలుసుకోవాలనే అనిపిస్తుంది. మనకి మన వాళ్లు ఇచ్చే విలువేంటో తెలుసుకోవాలనిపిస్తుంది.

ఒక్కసారి చచ్చి మళ్ళీ బతకాలనిపిస్తుంది. నేనేంటో, నా విలువేంటో తెలుసుకోవాలనిపిస్తుంది. చేసిన తప్పులేంటో, బాధ పెట్టిన క్షణాలెన్నో, క్షమించాల్సిన మనసులెన్నో అన్నీ చూడాలని, వినాలని ఉంది. సాధ్యం కాదు అని తెలిసినా.. ఆ ఊహ వినడానికి బాగుంది..!

* డాలర్ రేటు రాదు పడితే లేపడానికి మనిషి విలువ
* సినిమా రివ్యూ కాదు రేటింగ్ యివ్వడానికి మనిషి విలువ
* facebook posting కాదు like, comments ఇచ్చేందుకు మనిషి విలువ
* Real estate, gold rate, IT boom కాదు మనిషి విలువ

ఒక సినిమా లాంటిది మనిషి విలువ. మున్నాళ్ల జీవితం మూడు గంటల సినిమాలో ఒక పాత్రలాగా పాత్రని పోషించి, నవ్వించి, కవ్వించి, ఏడిపించి, అలరించి వెళ్లిపోతుంది.

అందుకే సాటి మనిషిని ప్రేమిద్దాం.. ప్రేమను  పంచుదాం..

By
en-us Political News

  
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.