వంశీ ఈజ్ బ్యాక్: వేరీజ్ క్యాడర్.. గన్నవరంలో పట్టు సాధించగలరా.?

Publish Date:Oct 13, 2026

Advertisement

వైసీపీ హయాంలో మంచీచెడూ అన్న విచక్షణ లేకండా అనుచిత భాషా ప్రయోగంతో అప్పటి విపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లోకేష్ లపై విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత కలికానిక్కూడా కనిపించకుండా, వినిపించకుండా సైలెంట్ అయిపోయారు. అప్పటి సీఎం జగన్ మెప్పు పొందడమన్న ఏకైన లక్ష్యంతో కన్నూ మిన్నూ గానకుండా అహంకారంతో విర్రవీగారు. ఆ తరువాత తత్వం బోధపడి బహిరంగ క్షమాపణలు చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తనకు తిరుగే లేదనుకున్న గన్నవరంలో ఘోర పరాజయం పాలవ్వడమే కాకుండా, ఆ తరువాత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

ఓటమి తరువాత ఈ 30 నెలల కాలంలో ఆయన దాదాపు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అడపాదడపా తప్ప బహిరంగంగా జనాల మధ్యకు వచ్చిందే లేదు. సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు. తాను గన్నవరం వదిలి వెళ్లేది లేదని చెబుతూ.. వైసీపీ అధినేత జగన్ తన వెంట ఉన్నారనీ, గన్నవరంలో మళ్లీ మరింత బలం పుంజుకుంటాననీ ధీమా వ్యక్తం చేశారు.  

ఆయన ధీమా సంగతి అటుంచితే..  గన్నవరంలో వల్లభనేని వంశీ మళ్లీ మునుపటి పట్టు సాధించడం అంత సులభం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సుదీర్ఘకాలం పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండటం, అలాగే   తీవ్రమైన అవినీతి ఆరోపణల కారణంగా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకత్వం గణనీయంగా తగ్గిపోయింది. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించడం వల్లభనేని వంశీకి పెను సవాలేనని అంటున్నారు.   

తాజాగా వంశీ మాటలను బట్టి 2029 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయం అని అవగతమౌతుంది. అయితే  క్షేత్రస్థాయిలో ప్రజా మద్దతు సంపాదించుకోవడం వంశీకి ఎంత వరకూ సాధ్యమౌతుందన్న అనుమానాలు వైసీపీ క్యాడర్ లోనే వ్యక్తమౌతున్నాయి.  

 

[Vallabhaneni Vamsi Active Politics Again, Gannavaram Politics, YCP Vamsi ReEntry,  Vallabhaneni Vamsi, AP Politics,  Gannavaram Constituency,   Telugu One]

By
en-us Political News

  
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.