Publish Date:Aug 30, 2024
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్తా ఎక్కువే . తెలంగాణలో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. గత బిఆర్ఎస్ సర్కారు అవినీతి, అహంకారం వల్ల అధికారం కోల్పోయింది. ఐక్యతారాగం లేకపోవడం వల్ల పదేళ్లు కాంగ్రెస్ కూడా అధికారంలో రాలేకపోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అయితే ఆ క్రెడిట్ మాత్రం అప్పటి టిఆర్ఎస్ అధినేత కెసీఆర్ కొట్టేశారు. టిఆర్ ఎస్ బిఆర్ఎస్ గా మారిన తర్వాత అసలు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీని ఇతర పార్టీలు ఓడించవు. అంతర్గత కుమ్ములాటల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోయాయి. ఇది చరిత్ర. చరిత్ర చెప్పిన గుణ పాఠాలతో ఇన్నాళ్లు బుద్దిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు మెల్లి మెల్లిగా బయటపడుతున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అని స్వయంగా ఆయన భార్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అంటూ ఒక వర్గం ప్రచారం చేసింది. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటూ కొత్త రాగం అందుకున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నీటి పారుదల పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజగోపాల్ ఈ మాట అన్నారు. బిజెపి నుంచి కాంగ్రెస్లో చేరి మునుగోడు టికెట్ పై గెలిచిన రాజగోపాల్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. తన నాలుక మీద పుట్టు మచ్చలు ఉన్నాయి కాబట్టి నిజం అవుతుందన్నారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/uttam-cm-is-a-new-song-by-rajagopal-reddy-39-183943.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.