సెప్టెంబర్ 13,  శుక్రవారం వెనక ఉన్న ఈ నమ్మకాల గురించి తెలుసా?

Publish Date:Sep 13, 2024

Advertisement

 

చరిత్రలో ప్రతి తేదీకి ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది. వీటిలో కొన్ని మంచివి అయితే మరికొన్ని చెడ్డవి.  కొన్ని తేదీలు ప్రపంచ వ్యాప్తంగా,  మరికొన్ని కొన్ని దేశాలకు ప్రత్యేకంగా ఉంటే.. మరికొన్ని తేదీలు విషాదాన్ని,  చెడును సూచిస్తాయి. సెప్టెంబర్ 13, శుక్రవారం కూడా అలాంటిదేనట.  సెప్టెంబర్ 13,  శుక్రవారం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో చెడ్డ దినంగా పేర్కొంటున్నారు.  దీని వెనుక ఉన్న కారణాలేంటంటే..


సరిగ్గా గమనిస్తే కొన్ని భవనాలకు అసలు 13 సంఖ్యతో అంతస్తు ఉండదు. ఎందుకంటే 13 వ సంఖ్యను అశుభంగా పరిగణిస్తారు.  అందులోనూ 13వ తేదీ వచ్చిన శుక్రవారాన్ని అయితే మరీ అశుభప్రదమైనదిగా భావిస్తారు. భారతదేశంలో కాకుండా విదేశాలలో ఈ సెప్టెంబర్ 13వ తేదీ గురించి నమ్మకం ఎక్కువగా ఉంది.  ఇది పవిత్ర గ్రంథం బైబిల్ లో ప్రముఖంగా ప్రస్తావించబడింది.

యేసు క్రీస్తు శుక్రవారం రోజునే సిలువ వేయబడ్డాడనే విషయం అందరికీ తెలిసిందే.. ఇదే విషయం బైబిల్ లో కూడా చెప్పబడింది. ఇది మాత్రమే కాకుండా ఆ నాడు చివరి విందులో 13 మంది ఉన్నారని,   ఈ 13మందిలో ఒకరు యేసును అప్పగించారని బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ కారణంగా 13 వ తేదీ అన్నా.. ముఖ్యంగా 13వ తేదీ వచ్చే శుక్రవారం అన్నా ఇష్టపడరు.


రచయిత థామస్ విలియం లాసన్ 1907లో  రాసిన ఫ్రైడే ది 13త్ నవల కూడా ఈ మూఢనమ్మకం పెరగడానికి కారణంగా మారింది. ఇది మాత్రమే కాకుండా 1980లో విడుదల అయిన ఫ్రైడే ది 13త్ సినిమా కూడా ప్రజల్లో ఈ మూఢనమ్మకాన్ని మరింత బలపరిచింది.


ఇది మాత్రమే కాకుండా ఫిన్లాండ్ లో సెప్టెంబర్ 13న వచ్చే శుక్రవారాన్ని జాతీయ ప్రమాద దినోత్సవంగా జరుపుకుంటారు.  తద్వారా ప్రజలు భద్రతా నియమాలను సరిగా పాటిస్తారు. ఇలాంటి అనేక కారణాల వల్ల సెప్టెంబర్ 13 వ తేదీ శుక్రవారం గురించి ప్రజలలో మూఢనమ్మకాలు చాలా ప్రబలంగా వ్యాపించి ఉన్నాయి. సామాన్య జీవితంలో పెద్దగా మార్పులు లేకపోయినా ఇప్పట్లో జరుగుతున్న సంఘటనలు ప్రజలలో ఈ మూఢ నమ్మకాలను మరింత పెంచుతున్నాయి.


                                     *రూపశ్రీ.
 

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.