Publish Date:Apr 24, 2025
గత కొన్నేళ్ల నుంచి కొత్త కశ్మీరం ఆవిష్కరిస్తున్న వేళ.. ఎన్నడూ లేని విధంగా పర్యాటకులు సందడి చేస్తున్న సమయాన.. కాశ్మీరం నిజంగానే ఒక భూతల స్వర్గమా అనిపించింది. కశ్మీర్ భారత్ లో భాగం అయితే మనకు ఇంతటి భాగ్యం లభిస్తుందా? అన్న కోణంలో స్థానిక కశ్మీరీలు కూడా ఎంతో ఆనందంగా ఉన్న సందర్భం కూడా ఇదే.
Publish Date:Apr 24, 2025
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడితో.. భారత్ మొత్తం రగిలిపోతోంది. హిందూ టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు జరిపిన కాల్పులతో.. దేశం ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మారింది. టెర్రరిస్టులు కేవలం హిందువులనే ఎంపిక చేసుకొని మరీ దాడి చేయడానికి కారణమేంటి? హిందువులను చంపడం వల్ల.. వారు సాధించేదేమిటి? పహల్గాం ఉగ్రదాడి వెనకున్న అసలు కోణమేంటి? అన్నది పెద్ద డిబేట్‌గా మారింది.
Publish Date:Apr 24, 2025
కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల కిరాతక దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలకు సిద్ధం అయ్యింది. ప్రాథమికంగా కొన్ని చర్యలను తీసుకుంది. అందులో భాగంగా దేశ సరిహద్దులను మూసేసింది. వివిధ పనుల నిమిత్తం ఇండియాకు వచ్చిన పాక్ జాతీయులు మే ఒకటవ తేదీ లోగా భారత్ విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Publish Date:Apr 24, 2025
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇండియా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని నిర్ధారణ కావడంతో ఇండియా కఠిన చర్యలకు రెడీ అయ్యింది.
Publish Date:Apr 24, 2025
మాజీ మంత్రి విడదల రజనీని విశాఖ విమానాశ్రయంలో నిర్బంధించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వైసీపీ హయాంలో యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్ క్రషర్స్ నిర్వాహకులను బెదిరించి రూ.2. 20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది గోపి, అలాగే వీరికి సహకరించిన అధికారి జాషూవా, మాజీ మంత్రి విడదల రజని పీఏ రామకృష్ణపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
Publish Date:Apr 24, 2025
వైసీపీ నాయకురాలు, చిలకలూరి పేట మాజీ మంత్రి విడదల రజనీకి భారీ షాక్ తగిలింది. ఆమె మరిది.. విడదల గోపీనాథ్ ను ఏసీబీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. విడదల గోపీనాథ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంలో ఏసీబీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో ఈ తెల్లవారు జామున అదుపులోనికి తీసుకున్నారు.
Publish Date:Apr 23, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
Publish Date:Apr 23, 2025
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మరో మూడు రోజుల్లో ( ఏప్రిల్ 27) ఇరవై నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని రజతోత్సవ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతోంది. ఒక విధంగా ఇదొక అపూర్వ సందర్భం.
Publish Date:Apr 23, 2025
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిని చంద్రబాబు ఖండించారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత, భద్రత విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు.
Publish Date:Apr 23, 2025
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై పాక్ పౌరులను భారత్ లోకి అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న పాక్ పౌరులు, పర్యటకులు తక్షణమే తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జారీ చేసిన ప్రత్యేక వీసాలను రద్దు చేసింది
Publish Date:Apr 23, 2025
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూతురు ఎంగేజ్మెంట్‌కు హారయ్యేందుకు ఆయన సంగారెడ్డి వెళ్తున్నట్టు సమాచారం.
Publish Date:Apr 23, 2025
ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని సందర్శించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు సహకరించిందని, సభ ముగిసే వరకు ఇదే సహకారం అందించాలని జిల్లా యంత్రాంగాన్నికేటీఆర్ కోరారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాట సభ కాదని, కేవలం పార్టీ వార్షికోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు
Publish Date:Apr 23, 2025
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది కార్పొరేటర్లు, 31 మంది అఫిషియో సభ్యులలో 21 మంది ఓటు వేశారు. ఓటింగ్ లో బీఆర్ఎస్ మినహా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ ఓటర్లు తమ ఓటు బక్కు వినియోగించుకున్నారు