దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ హైకోర్టు పేర్కనడాన్ని ఆయన హర్షించారు. ప్రజాస్వమ్యంలో హింసకు, ఉగ్రవాదానికి చోటు లేదని హైకోర్టు తీర్పుద్వారా మరో సారి స్పష్టమైందని కిషన్ రెడ్డి అన్నారు.
పుష్కర కాలంగా దిల్ సుఖ్ నగర్ జంటపేలుళ్లు ఆ పెలుళ్ల బాధితులను ఓ పీడకలగా వెంటాడుతున్నాయన్న ఆయన.. ఎట్టకేలకు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని అన్నారు. బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు జీరో లోలరెన్స విధానంతో మోడీ సర్కార్ ముందుకు సాగుతోందన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ చేసి, నిందితులను శిక్షించడంలో కీలకపాత్ర వహించింది.ఈ పేలుళ్ళ సంఘటన దర్యాప్తు చేసిన పోలీస్ సిబ్బందిని కిషన్ రెడ్డి అభినందించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/union-minister-kisham-reddy-welcomes-hicourt-verdict-25-195843.html
విశాఖ సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై యాక్షన్ తీసుకుంది. విచారణ కమీటీ నివేదిక మేరకు. దేవాదాయ, పర్యాటక శాఖకు చెందిన ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్ సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది.
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. పగలంతా భానుడు భగభగమంటే.. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులతో పలు చోట్ల వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇవాళ హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రానికి చల్లబడింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట, బీహెచ్‌ఈఎల్ కూడలిలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరచడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్డీయే సర్కారు కృషి చేస్తోందని గడ్కరీ అన్నారు. రహదారుల నిర్మాణం కోసం పెండింగ్‌లో ఉన్న భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు సరిగా జరగడం లేదన్నారు. అందుకే పనులు వేగంగా చేసేలా కొత్త కాంట్రాక్టర్‌ను మార్చామని, పది నెలల్లో ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని చెప్పారు.‘‘హైదరాబాద్‌లో ఐటీతోపాటు ఫార్మా రంగం కూడా పెద్దదే. దేశంలోని ఎన్నో నగరాల నుంచి హైదరాబాద్‌కు వస్తుంటారు.
ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఇవాళ సాయంత్రం కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురై జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడతో పాటు రుద్రంగి ప్రాంతాల్లో సుమారు ఐదు సెకన్ల పాటు భూమి తీవ్రంగా కదలడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించడంతో ఇళ్లల్లోని వస్తువులు సైతం స్వల్పంగా కదలడం మొదలుపెట్టాయి. దీంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందుతున్న ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీస్ లో యువతకు శిక్షణఇచ్చి, వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేయడానికి ప్రఖ్యాత సంస్థ ఒరాకిల్ తో కూటమి సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒరాకిల్, ఎపిఎస్ఎస్డీసి ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. దీనిద్వారా ఎంపిక చేసిన యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్ స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతలో ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు రాజకీయాలు ఎంతో ఆసక్తి రేపుతూ ఉంటాయ్. ఇది.. ఆంధ్రా మొత్తం తెలిసిన ముచ్చటే. ఎందుకంటే.. అన్ని చోట్లా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సాగే రాజకీయం.. రాప్తాడుకొచ్చేసరికి మరోలా మారిపోతుంది. ఇక్కడ.. పరిటాల వర్సెస్ తోపుదుర్తి వర్గాల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజీలో ఉంది. తెలుగుదేశం నుంచి పరిటాల సునీత ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. 2009, 2014, 2014 ఎన్నికల్లో.. పరిటాల సునీత 3 సార్లు ప్రకాశ్ రెడ్డిపై గెలుపొందారు. కానీ.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో.. తోపుదుర్తి బ్రదర్స్ లోకల్ పాలిటిక్స్‌ని శాసించారనే ప్రచారం ఉంది. ఐదేళ్ల పాటు వాళ్లు ఏం చెబితే అది జరిగిందనే టాక్ ఉంది. కానీ.. ఇది ఎంతో కాలం కొనసాగలేదు. 2024 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని సామెతను తలపిస్తోంది ఖమ్మం జిల్లా పరిస్థితి… జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్జమంత్రివర్గంలో ఏకంగా ముగ్గురుకి స్థానం కల్పించారు.. ముగ్గురులో ఒకరు సీనియర్ మంత్రి.. మరో ఇద్దరు తొలిసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.. వీరిలో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పై దృష్టిసారించారు. మిగిలిన ఇద్దరు కూడా తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు..ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన మల్లు భట్టి విక్రమార్క కూడా తన సొంత నియోజకవర్గమైన మధిర అభివృద్ధికే పరిమితమయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటునడం వరకే పరిమితమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ సమ్మెకు సిద్ధమవుతోంది. ఈనెల 7 నుంచి సమ్మె నేపధ్యంలో భారీ ఎత్తున కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లో బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్ వెంకన్న వాపోయారు.
మైనింగ్.. మైనింగ్.. మైనింగ్.. నెల్లూరు పాలిటిక్స్ మొత్తం ఈ మైనింగ్ చుట్టే తిరుగుతున్నాయ్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రచ్చ మాత్రం మైనింగ్ చుట్టూనే. నెల్లూరు జిల్లాలో సైదాపురం, గూడూరు, పొదలకూరు మండలాల్లో అనేక మైనింగ్ క్వారీలున్నాయ్. వీటిలో.. కోట్ల విలువైన క్వార్జ్, పల్స్ ఫర్ లాంటి విలువైన ఖనిజాలున్నాయ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. ఈ విలువైన ఖనిజాలు అక్రమంగా తరలుతున్నాయని ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తున్నాయ్.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రమంత్రి శుభ వార్త చెప్పారు. విశాఖ టు విజయవాడకు విమాన సర్వీసులు పున: ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం మధ్య విమాన సర్వీసులు జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభించినున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇండిగో విమానం విజయవాడలో ఉదయం 7.15 గంటల నుంచి ప్రారంభమై విశాఖకు ఉదయం 8.25 గంటలకు చేరుకుంటుంది.
ప్రకాశ్ రాజు ఇటీవలి కాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. అదే కోవలో తాజాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సగం మంది సెలబ్రిటీలు అమ్ముడు పోయారనీ, మిగిలిన సగం మంది భయంతో మౌనాన్ని ఆశ్రయించారనీ అంటూ విమర్శలు గుప్పించారు.
మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మే7 వ తేదీ నుండి జున్2 తేదీ వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న 72వ ప్రపంచ అందాలు పోటీల్లో ఎలాంటి అవాంతరాలు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎయిర్‌పోర్టు నుంచి అతిథులు బస చేసే హోటల్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో ముగ్గురు కీలక నిందితుల అరెస్టుకు రంగం సిద్ధమైందా? హైకోర్టు, సుప్రీం కోర్టూ కూడా ముందస్తు బెయిలుకు నిరాకరించడంతో వారి అరెస్టు ఇక అనివార్యమా? అంటే ఔనన్న సమాధానమే వస్తుంది.