వార్షిక బడ్జెట్.. ఈ సారైనా జనరంజకంగా ఉండేనా?!

Publish Date:Jan 30, 2025

Advertisement

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 31)నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సారి బడ్జెస్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత సమావేశాలు శుక్రవారం (జనవరి 31)న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకూ జరుగుతాయి. ఇక రెండో  విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకూ సాగుతాయి. ఇలా ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (జనవరి 31) పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో  బడ్జెట్ సమావేశాలు ప్ర ఈ సమావేశాలు ప్రారంభమౌతాయి.  రాష్ట్రపతి ప్రసంగం తరువాత ఆ రోజు కు సభ వాయిదా పడుతుంది. ఆ మరుసటి రోజు అంటే శనివారం (ఫిబ్రవరి 1)న కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడతారు.  

 వార్షిక బడ్జెట్  సభలో ప్రవేశ పెట్టే ప్రతి సారీ దేశ ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి జీవులు తమకు ఈ బడ్జెట్ ఊరటకలిగిస్తుందని ఆశిస్తారు. మరీ ముఖ్యంగా వేతన జీవులు ఆదాయ పన్ను పరిమితి పెంపుపై పలు ఆశలు పెంచుకుంటారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఏడు సార్లు యూనియన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ఇప్పుడు ఎనిమిదో సారి కూడా ప్రవేశపెట్టి తన రికార్డును తానే తిరగరాయనున్న విత్త మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడు సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు కానీ, వేతన జీవులకు కానీ పెద్దగా ఊరట కలిగించింది లేదు. అయితే ఈ సారి మాత్రం నిర్మలా సీతారామన్ బడుగు, మధ్యతరగతి, వేతన జీవులకు ఒకింత ఊరట కలిగేలా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.  ముఖ్యంగా ఇన్ కంటాక్స్ పరిమితి పెంపు, జీఎస్టీ రేట్ల తగ్గింపు వంచి చర్యలు ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. 

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.