పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. 2023-24 వార్షిక బడ్జెట్ ను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. సమావేశాల మొదటి రోజు అంటే జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు ఆర్థిక సర్వే నివేదికను ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్ట నుంది బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనుంది.
మొదటి సెషన్ జనవరి 31నుంచి ఫిబ్రవరి 10వరకూ, రెండో సెషన్ మార్చి 6నుంచి ఏప్రిల్ 6 వరకు జరుగుతుందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. కాగా పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై సభ్యులు ప్రసంగాల అనంతరం తీర్మానాన్ని ఆమోదిస్తారు. అలాగే ఫిబ్రవరి 1న విత్తమంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై చర్చ ఉంటుంది. చర్చ అనంతరం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తారు. .రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చ జరుగుతుంది. బడ్జెట్‌కు సభ ఆమోదం తెలుపుతుంది.
పార్లమెంటు కొత్త భవనం సెంట్రల్ విస్టా పనులు చురుగ్గా సాగుతున్నాయి. బడ్జెట్ రెండో విడత సమావేశాలను సెంట్రల్ విస్టా హాలులోనే నిర్వహించేందుకు వీలుగా చర్యలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/union-budget-on-feb-1st-39-149445.html
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.