ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా..!
Publish Date:Aug 13, 2026
Advertisement
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికి పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీ లోకి తీసుకొని విచారణ చేసిన విషయం తెలిసిందే... అయితే విచారణ సమయంలో ఉదయ్ పోలీసులకు సహకరించలేదని, నోరు మెదపలేదని మరోసారి కస్టడీలోకి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు... ఇంకా మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు... రేపటికి వాయిదా వేసింది..బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే, పోలీసులు తమ కౌంటర్‌ను ఇంకా దాఖలు చేయాల్సి ఉండటంతో విచారణను రేపటికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డి తరఫున హాజరైన న్యాయవాదులు పోలీసుల దర్యాప్తు తీరుపై కోర్టులో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. దర్యాప్తు సందర్భంగా పోలీసులు నిబంధనలు, కోర్టు ఆదేశాలను పాటించడం లేదని వారు మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికే పోలీసులు పలుమార్లు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాదులు కోర్టును కోరారు. మరోవైపు, కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు, ఇప్పటివరకు పోలీసులు సేకరించిన ఆధారాలు, బెయిల్ ఇవ్వకూడదనే తమ అభ్యంతరాలను కౌంటర్ రూపంలో కోర్టుకు సమర్పించేందుకు పోలీసులు సిద్ధమవుతు న్నారు. ఈ నేపథ్యంలో రేపటి విచారణ కీలకంగా మారనుంది. పోలీసుల తరఫున కౌంటర్ దాఖలు చేయాలని రాజేంద్రనగర్ కోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలైన అనంతరం దానిపై ఉదయ్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై రాజేంద్రనగర్ కోర్టు నిర్ణయం వెలువరించాల్సి ఉంది. రేపటి విచారణలో పోలీసులు దాఖలు చేసే కౌంటర్, ఇరుపక్షాల వాదనలు, కోర్టు పరిశీలన అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరవుతుందా లేదా అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. Uday Krishna Reddys bail petition postponed to tomorrow, Rajendranagar Court, Bail Petition, Upparapally Court
http://www.teluguone.com/news/content/uday-krishna-reddys-bail-petition-postponed-to-tomorrow-36-228842.html





