ఉడాన్ యాత్రి కేఫ్.. విమానాశ్రయంలో కాఫీ ధర ఎంతో తెలుసా?

Publish Date:Mar 1, 2025

Advertisement

సరసమైన ధరలకు విమానాశ్రయాలలొ ఆహారం అందించేందుకు ఉద్దేశించిన  ఉడాన్ యాత్రి కేఫ్ ను చెన్నై విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం (ఫిబ్రవరి 27) ప్రారంభించారు. రెండు నెలల కిందట ఉడాన్ యాత్రి కేఫ్ ను కోలకత్తాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభమైంది, ఇది ప్రయాణికులకు బడ్జెట్-స్నేహపూర్వక ఎంపికలను అందిస్తుంది. త్వరలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ప్రారంభం కానుంది.

విమానాశ్రయంలో  తినుబండారాలు, కాఫీ, టీ వంటి వాటి ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ఆఖరికి వాటర్ బాటిల్ కూడా ప్రియమే. దీంతో విమానప్రయాణీకులకు సరసమైన ధరలకే  ఆహారం, పానీ యాలు అందించాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటి ఉడాన్ యాత్రి కేఫ్ కోల్ కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఏడాది డిసెంబర్ 19న ప్రారంభమైంది. ఈ కేఫ్ విమాన ప్రయాణీకుల అభిమానాన్ని చూరగొంది.  నాణ్యత, రుచి  ధరలపై సర్వత్రా సంతృప్తి వ్యక్తమౌంది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రాయాలలోనూ వీటిని ప్రారంభించాలన్న డిమాండ్ వెల్లువెత్తింది. దీంతో విమాన ప్రయాణీకుల డిమాండ్ మేరకు వీటిని దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకూ విస్తరించాలని భావిస్తున్నారు. 

ఉడాన్ యాత్రి కేఫ్ లో వాటర్ బాటిల్ పది రూపాయలకు, టీ పది రూపాయలకు లభిస్తాయి. ఇక కాఫీ ధర అయితే 20 రూపాయలు మాత్రమే. ఇప్పటి వరకూ అధిక ధరలకు వీటిని కొనుగోలు చేసిన విమాన ప్రయాణీకులు ఉడాన్ యాత్రి కేఫ్  అందుబాటులోకి  రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సమోసా, స్వీట్ కూడా 20 రూపాయలకే లభిస్తుంది. విమానయానాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా విమానాశ్రయాలలో ప్రయాణీకులకు అందుబాటు ధరలో ఆహారం, టీ, కాఫీ అందించే ఉద్దేశంతో ఉడాన్ యాత్రి కేఫ్ ల ఏర్పాటుకు కేంద్రం సమయాత్తమౌతోంది. అందులో భాగంగానే తొలుత కోల్ కతా, ఆ తరువాత చెన్నై ఎయిర్ పోర్టులలో వీటిని ఏర్పాటు చేసింది. త్వరలో ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఉడాన్ కేఫ్ అందుబాటులోకి రానుంది. దేశ వ్యాప్తంగా విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం ప్రవేశ పెట్టిన ఉడాన్ పథకంలో భాగమే ఉడాన్ యాత్రీ కేఫ్ లను కేంద్రం ప్రారంభిస్తున్నది. 

By
en-us Political News

  
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది.
గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు..అప్రమత్తమైన యంత్రాంగం.!
ఒకవైపు ధరల మంట.. మరోవైపు కృత్రిమ కొరతలు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.