పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు .. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై సస్పెన్ష్ వేటు

Publish Date:Apr 13, 2025

Advertisement

తిరుమలలో శనివారం (ఏప్రిల్ 12) జరిగిన అపచారానికి సంబంధించి బాధ్యులపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. అసలేం జరిగిందంటే. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు తిరుమల ఆలయం మహాద్వారం వరకూ పాదరక్షలతో వచ్చారు.  మహాద్వారం వరకూ భక్తులు రావడానికి ముందు మూడు ప్రాంతాలలో ఉన్న తనిఖీలను వారు దాటుకుని వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలతో మహాద్వారం వరకూ మధ్యలో తనిఖీలను దాటుకుని భక్తులు రావడంతో సిబ్బంది నిర్లక్ష్యం ప్రస్షుటమైంది. మహారాష్ట్రకు చెందిన అభిషేక్, ముఖేష్‌లు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చారు. శ్రీవాణి టికెట్‌పై వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 నుండి వీరు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే వీరు డిస్పోజబుల్ పాదరక్షలు ధరించి వచ్చిన సంగతిని అక్కడి సిబ్బంది గుర్తించి వారిని ఆపారు.  

అసలు మహాద్వారం వరకూ భక్తులు చెప్పులతో  వస్తుంటే విజిలెన్స్, టీటీడీ అధికారులు ఏంచేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది.  విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది.   ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్నతిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంి, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేసింది.  అలాగే   నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బంది ఆరుగురిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదనలు పంపించింది.  

By
en-us Political News

  
ఒకే ఒక్క మాటతో రాజకీయం తల్లకిందులు అయిపోయిన సందర్భాలు చరిత్రలో కాదు, నడుస్తున్న చరిత్రలోనూ చాలానే ఉన్నాయి. అయినా.. రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు నోరు జారుతూనే ఉంటారు. ఇందుకో తాజా ఉదాహరణ తెలంగాణ పీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్.
స్మితా స‌బ‌ర్వాల్ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిణి. 2001లో ట్రైనీ ఐఏఎస్ గా కెరీర్ మొద‌లు పెట్టి.. బీఆర్ఎస్ హ‌యాంలో సీఎంఓలో అపాయింట్ అయిన తొలి మ‌హిళా ఉన్న‌తాధికారిణిగా ఆమెకున్న నేమ్ అండ్ ఫేమ్ నేష‌న‌ల్ రేంజ్. ఒక స‌మ‌యంలో ఆమె గురించి ఒక ఆంగ్ల ప‌త్రిక‌లో త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌సార‌మైందంటే ప‌రిస్థితి ఏంటో ఊహించుకోవ‌చ్చు.
వేములవాడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకపోయినా తప్పుడు పత్రాలు సమర్పించిన ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చెన్నమనేని రమేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫిర్యాదుతో చెన్నమనేనిపై తెలంగాణ సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను అందించాలని పిలుపునిచ్చింది. బుధవారం కేసు వివరాల్ని అందించేందుకు ఆది శ్రీనివాస్‌ సీఐడీ ఎదుట హాజరుకానున్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై పౌరసత్వంపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా,ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో చెన్నమనేని పౌరసత్వంపై పలు దఫాలుగా విచారణ చేపట్టింది. విచారణలో గతేడాది డిసెంబర్‌ నెలలో చెన్నమనేని రమేష్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
విజ‌య‌సాయి రెడ్డి చెప్పిన‌ట్టు రాజ్ క‌సిరెడ్డి తెలివైన వాడే. ఆయ‌న మ‌ద్యం డ‌బ్బును ఎలా చేతులు మారుస్తారంటే.. ర‌క ర‌కాల విధానాల్లో వాటిని దారి మ‌ళ్లించి తిరిగి ఆ మొత్తం డ‌బ్బును ఒక చోట చేర్చ‌డంలో త‌న తెలివైన హైటెక్ బుర్ర‌ను వాడుతుంటారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వేధించే విషయంలో తన పర బేధం లేదు. ఆయన హయంలో తెలుగుదేశం, జనసేన నేతలే కాదు, ఆయన సొంత పార్టీ అయిన వైసీపీ నేతలూ వేధింపులకు గురయ్యారు. అంతెందుకు సొంత చెల్లి, తల్లికి కూడా ఆయన నుంచి వేధింపులు తప్పలేదు.
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి.  భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతతో తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బ  తగిలి సోమవారం ఒక్కరోజే 9 మంది మృతి చెందారు. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొన్నాది. గరిష్ఠంగా 44-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల  జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. షర్బత్​ జిహాద్​ అంటూ రాందేవ్ బాబా చేసిన కామెంట్స్‌పై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రామ్​దేవ్​ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్​కు వ్యతిరేకంగా హమ్​దార్ద్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్​పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ నెల ప్రారంభంలో బాబా రాందేవ్ పతంజలి గులాబీ షర్బత్‌ను ప్రారంభించినప్పుడు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. "మీకు షర్బత్ ఇచ్చే కంపెనీ సంపాదించే డబ్బును మదర్సాలు, మసీదులను నిర్మించడానికి ఉపయోగిస్తారు. కానీ మీరు దీన్ని తాగితే (పతంజలి గులాబీ షర్బత్‌ను ఉద్దేశిస్తూ) గురుకులాలు నిర్మిస్తాం. ఆచార్య కులం అభివృద్ధి చెందుతుంది.
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌ – 2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దూబే అనే అభ్యర్థికి మొదటి ర్యాంకు వచ్చింది. తెలుగు అభ్యర్థి సాయి శివాణికి 11వ ర్యాంక్ వచ్చింది. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన 2,845 మందిని ఇంటర్వ్యూ చేసిన యూపీఎస్సీ ఇవాళ తుది ఫలితాలను ప్రకటించింది.
ఏపీ మద్యం కుంభకోణం విచారణ తుది దశకు వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఈ కేసులో త్వరలోనే వైసీపీ పెద్దలందరికీ నోటీసులు అందబోతున్నాయా? అన్న ప్రశ్నకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే జవాబే వస్తున్నది. వైసీపీ మాజీ ఎంపీ, విజయసాయి రెడ్డి ఈ కుంభకోణంలో కర్త, ఖర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తాను మొదటే చెప్పాననీ అంటున్నారు. అంతే కాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ తాను బయటకు లాగుతాననీ చెబుతున్నారు.
జగన్ కు అత్యంత విశ్వసనీయ సహచరుడు, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ జగన్ తో కలిసి నడిచి, ఆఖరికి ఆయన అక్రమాస్తుల కేసులో కూడా సహనిందితుడిగా జైలు జీవితం కూడా అనుభవించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ కు పూర్తి వ్యతిరేకంగా మారిపోయారు.
భారతీయ జనతా పార్టీలో ఏమి జరగుతోంది? జాతీయ అధ్యక్షుని ఎన్నికలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? తెలంగాణ సహా అనేక ఇతర రాష్ట్రల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ఎందుకు ముడిపడడం లేదు? అందుకు పార్టీ నేతలు చెపుతున్న కారణాలేనా లేక ఇంకా లోతైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే, కమల దళంలో జరుగతున్న పరిణామాల వెనక లోతైన కారణాలే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అంటే కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకటి రెండు సార్లు కాదు.. వందల సార్లు రాహుల్ గాంధీ ఐ హేట్ ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆఫ్కోర్స్, ఆయన అవే పదాలను, అదే క్రమంలో అని ఉండక పోవచ్చును, కానీ ఎప్పుడు ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చినా.. రాహుల్ గాంధీ తన వ్యతిరేకతను, ద్వేషాన్నీ ఎప్పుడూ దాచుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ముంబై నటి జత్వానీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. బేగంపేటలోని ఆయన నివాసంలో అదుపులోనికి తీసుకుని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్‌ హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.