భక్తుల రక్షణను టీటీడీ గాలికొదిలేసిందా?.. భక్తులలో వెల్లువెత్తుతున్న అనుమానాలు

Publish Date:Aug 14, 2023

Advertisement

తిరుమలకు వెళ్లే  అలిపిరి నడక దారిలో పిల్లలకు రక్షణ కరవైంది. అది నడక దారి కాదు.. మృత్యుమార్గం అని భక్తులు ఆవేదన, భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమల దేవుడి కొండకు నడిచి వస్తామని మొక్కుకున్న భక్తులు ఆ మొక్కు తీర్చడానికి ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ అధికారుల సంయుక్త వైఫల్యం, నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా భక్తుల ప్రాణాలు గాలిలో దీపంగా మారిపోయిన పరిస్థితి అలిపిరి నడకదారిలో ఏర్పడింది.

 ఒక సంఘటన జరిగిన తరువాత నిద్రనుంచి మేల్కొన్నట్లుగా ఇకపై అలా జరగదని  హామీ ఇచ్చి కొన్ని రోజులు భక్తుల భద్రత, రక్షణ అంటూ హడావుడి చేసి ఆ తరువాత షరామామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే వన్య ప్రాణులు భక్తులపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయని అంటున్నారు. ఇక  ఇటీవల తల్లిదండ్రులతో కలిసి నడక మార్గంలో వెంకన్న దేవుడి దర్శనం కోసం వెళుతున్న కౌశిక్ అనే బాలుడు చిరుత పులి పంజాకు చిక్కి అదృష్ట వశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సంఘటన తరువాత కూడా మొద్దు నిద్ర నుంచి మేల్కొని తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ అధికారుల కారణంగా తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన  లక్షితఅనే బాలిక చిరుత పలి దాడిలో ప్రాణాలు కోల్పోయింది.  అర్థరాత్రి సమయంలో చిరుత దాడి చేసి లక్షితను అడవిలోకి లాక్కుపోయింది. ఆ తరువాత చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, అటవీ ఆధికారుల గాలింపులో చిరుత దాడిలో మరణించిన చిన్నారి లక్షిత మృతదేహం బయటపడింది.  

చిన్నారి లక్షిత కనిపించని రోజు నుంచి.. ఆసుపత్రి నుంచి నెల్లూరుకు మృతదేహాన్ని తీసుకువెళ్లేంతవరకూ టీటీడీ అధికారులు కానీ, కొత్తగా టీటీడీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి కానీ, ఈవో ధర్మారెడ్డి కానీ ఆ చుట్టుపక్కలకు రాలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. 
 ‘ఇకపై ఇలాంటి సంఘటనలు జరగవని’  గతంలో కౌశిక్‌     అనే బాలుడు చిరుత దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో  కోలుకున్న తరువాత.. కాదు కాదు.. దాడి చేసిన చిరుతను అటవీ అధికారులు బంధించిన తరువాత కౌశిక్ తల్లిదండ్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఇటువంవటి సంఘటనలను పునరావృతం కానీయబోమనీ, పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రకటనలు ఇచ్చారు. అయితే తాజాగా చిన్నారి లక్షిత పులి దాడిలో మరణించిన ఘటనలో మాత్రం ఈవో ధర్మారెడ్డి.. అసలు ఆ పరిసర ప్రాంతాలకు రాకుండా ముఖం చాటేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

వరుస సంఘటనలు జరుగుతున్నా.. భద్రతా చర్యల విషయంలో పట్టించుకోకపోవడంతో ముఖం చాటేశారా అని నిలదీస్తున్నారు.  కాలి నడక దారిలో  ఇరువైపులా ఫెన్సింగ్ వేయిస్తామని టీటీడీ ఇచ్చిన హామీ హామీలాగే మిగిలిపోయింది. లక్షిత వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నడక దారిలో వెళ్లే భక్తులకు చిరుతపులుల దాడుల ముప్పు వెంటాడుతూనే ఉంది. వెంకన్న దేవుడి దర్శనం కంటే ముందే ఎలుగుబంట్లు, చిరుతలు దర్శనమిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడకమార్గంలో నడుస్తున్నామని చెబుతున్నారు. గుంపులు గుంపులుగా వెళ్లమనీ టీటీడీ చెబుతోందనీ, దాని వల్ల దాడుల భయం పోతుందా అని అనిదీస్తున్నారు. చిన్నారుల చేతులకు ట్యాగ్ లు కట్టి ఉపయోగమేమిటని నిలదీస్తున్నారు.

అంతా అయిపోయిన తరువాత గుర్తించడానికా ఇందుకేనా అటవీ శాఖ, టీటీడీ ఉన్నదని దుమ్మెత్తి పోస్తున్నారు.  వన్యప్రాణుల దాడులు జరుగుతున్నా కూడా రాత్రి వేళలో నడక దారి మూసేయాలన్న ఉద్దేశమే టీటీడీకి కలగకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. లక్షిత సంఘటన తరువాత కూడా  రాత్రి వేళల్లో నడకదారి మూసివేతపై చైర్మన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామనడం ఏమిటని భక్తులు నిలదీస్తున్నారు. నాస్తికులను టీటీడీ పాలకమండలి చైర్మన్ గా నియమించడం, కొండపై అన్యమత ప్రచారాలు జరుగుతుండటం, అన్యమతస్తులకు టీటీడీలో కొలువులు ఇవ్వడం సరిపోక.. ఇప్పుడు భక్తుల రక్షణను సైతం గాలికొదిలేసి.. వెంకన్న స్వామి దర్శనానికి వచ్చే వారిని రాకుండా చేయడమన్న కుట్ర ఏమైనా దీని వెనుక ఉన్నదా అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలు దేవాలయాలపై జరిగిన దాడుల విషయంలో నిందితులపై చర్యలు తీసుకోకపోవడం వంటి సంఘటనలను తమ అనుమానాలకు కారణంగా చెబుతున్నారు.   

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.