దీదీ చేజారిన తృణమూల్!?

Publish Date:Jun 6, 2026

Advertisement

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో   మహా సంక్షోభం తలెత్తింది. పదిహేనేళ్ల పాటు రాష్ట్రంలో తిరుగులేని అధికారం చెలాయించిన  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిట్టనిలువుగా చీలిపోయే పరిస్థితి ఎదుర్కొంటోంది.  ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి.  పార్టీ అధినేత్రి,  మాజీ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు.  గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఈ రాజకీయ హైడ్రామాలో  మొత్తం ఉన్న 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో ఏకంగా 58 మంది మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు పక్షాన నిలిచారు. ఈ రెబెల్ వర్గం అంతా ఏక తాటిపైకి వచ్చి ప్రత్యేక క్యాంప్ నిర్వహించడమే కాకుండా..  శాసనసభలో తామే అసలైన ప్రతిపక్షంగా గుర్తింపు పొందారు. పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే రీతబ్రత బెనర్జీకి ఈ 58 మంది శాసనసభ్యుల  మద్దతు ఉండటంతో.. అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ ఆయన్ను అధికారికంగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా  గుర్తించారు. 15 ఏళ్లపాటు తిరుగులేని అధికారంలో ఉన్న మమతకు ఇది కోలుకోలేని గట్టి దెబ్బ అనడంలో సందేహం లేదు. 

అయితే ఈ తిరుగుబాటు వెనుక అసలు కథ వేరే ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ అసమ్మతి జ్వాలలు మమతా బెనర్జీపై కంటే..  ఆమె మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి   అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలపైనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చాలా కాలంగా పార్టీలోని సీనియర్ నేతలను పక్కనపెట్టి..  అభిషేక్ బెనర్జీ సర్వాధికారాలు చెలాయించడంపై పార్టీ నేతల్లో లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయింది. ఎన్నికల ఓటమితో ఆ అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది.  రెబెల్స్ క్యాంప్‌లోని మెజారిటీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీపై గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఆమెను  ప్రధాన సలహాదారు పాత్రకు పరిమితం కావాలంటున్నారు.  మరోవైపు   23 మంది టీఎంసీ ఎంపీలు కూడా ఈ తిరుగుబాటు వర్గంతో  చేతులు కలిపినట్లు సమాచారం. 

ఈ భారీ సంక్షోభం నుంచి పార్టీని కాపాడుకునేందుకు మమతా బెనర్జీ   ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే  శుక్రవారం (జూన్ 5) తన నివాసంలో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని  నిర్వహించారు. రీతబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం పార్లమెంటరీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ  సోమవారం (జూన్ 8) నాడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాలని మమత నిర్ణయించారు.  అంతేకాకుండా..  పార్టీలో తిరుగుబాటును ఉక్కుపాదంతో అణచివేసేందుకు వీలుగా బెంగాల్‌లోని అన్ని కీలక రాష్ట్ర కమిటీలతో పాటు ఫ్రంటల్ సంస్థలను దీదీ రద్దు చేశారు. గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తరహాలోనే ఇప్పుడు బెంగాల్‌లో కూడా పార్టీ పేరు, గుర్తు కోసం కోర్టుల్లో న్యాయపోరాటం జరగే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.