ఫస్టుకి జీతాలొస్తాయా?
Publish Date:Oct 27, 2012
Advertisement
ట్రెజరీ ఉద్యోగులు సహాయ నిరాకరణ బాట పట్టడంతో నవంబరు ఒకటో తారీఖున తమకు జీతాలు అందుతాయో లేదోననే మీమాంసలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వున్నారు. ట్రెజరీ ఉద్యోగుల ఆందోళన కారణంగా ఇప్పటికే పదమూడు జిల్లాల్లో ప్రభుత్వపరంగా ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయాయి. మిగతా జిల్లాల్లోనూ త్వరలో ఇదే పరిస్థితి నెలకొంటుందని అంచనా వేస్తున్నారు. ట్రెజరీ ఉద్యోగుల ఆందోళనను విరమింపజేయడానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఎన్జీవోల సంఘం నాయకులు శనివారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిని కలిశారు. అయితే అక్కడ కూడా సానుకూల స్పందన రాలేదు. ఆర్థిక మంత్రితో, సంబంధిత శాఖాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోండని ముఖ్యమంత్రి ఎన్జీవో నేతలకు సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tresury-employees-24-18570.html
http://www.teluguone.com/news/content/tresury-employees-24-18570.html
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026





