టాలీవుడ్ సైలెన్స్.. కారణమేంటో తెలుసా?

Publish Date:Apr 16, 2024

Advertisement

తెలుగు సినీ పరిశ్రమకు అందిరకీ తెలిసిన కారణాలతోనే ఏపీలోని జగన్ సర్కార్ పట్ల ఒకింత అయిష్టత ఉంది. సినీమాల విడుదల, సినీమా టికెట్ల ధరల విషయంలో జగన్ సర్కార్ ఒకింత దుర్మార్గంగా వ్యవహరించిందన్న విషయంలో సినీ పరిశ్రమ జగన్ సర్కార్ విషయంలో కినుకతో ఉందనడంలో సందేహం లేదు. అయితే సినీ పరిశ్రమలో దిగ్గజాలనదగ్గ ఎవరూ కూడా బాహాటంగా జగన్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పన్నెత్తు మాట అనలేదు. పైపెచ్చు అలీ, పోసాని వంటి కమేడియన్ల మధ్యవర్తిత్వంతో టికెట్ల విషయంలో జగన్ తో బార్గెయినింగ్ కు ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. ఆ సందర్భంగా తెలుగుసినీ హీరోలకు ఒకింత అవమానం జరిగిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయాలను పరిశ్రమకు చెందిన ఎవరూ కూడా బాహాటంగా విమర్శించింది లేదు. 

అలాగే స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కూడా సినీ పరిశ్రమకు చెందిన ఒకరిద్దరు మినహా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వంటి వారు తప్ప చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదు. 

సరే అదలా ఉంచితే.. ఇటీవల మనమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన ఎన్నికల ప్రచార బస్సు యాత్రలో ఏపీ సీఎంపై గులకరాయి దాడి జరిగింది. ఈ దాడిలో జగన్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  అయితే టాలీవుడ్ సెలబ్రిటీలు,  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉండే తెలుగు హీరోలు, దర్శకులు ఎవరూ కూడా ఈ ఘటనపై  స్పందించలేదు. ఖండించలేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

రాష్ట్రంలో  ఎన్నికలకు కేవలం నాలుగు వారాల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి (అఫ్ కోర్స్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రే అనుకోండి)పై దాడి జరిగితే సినీ పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం. అయితే  వైఎస్ జగన్ వ్యవహరించిన విధంగా తెలుగు ఇండస్ట్రీ పట్ల ఇంత కక్ష పూరితంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఎవరూ ఇంత వరకూ లేరనీ, అందుకే జగన్ కు సంబంధించిన మంచి, చెడ్డల విషయంలో పరిశ్రమ మౌనంగానే ఉంటున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కొత్త సినిమా రిలీజ్ సందర్భంగా  టిక్కెట్ల ధరల పెంపు కోసం, బెనిఫిట్ షోల కోసం పరిశ్రమలో దిగ్గజ హీరోలు తన దగ్గరకు వచ్చి వేడుకునేలా చేసుకున్న జగన్ పట్ల ఇండస్ట్రీ లో ఓ విధమైన వ్యతిరేక భావన ఉందని అంటున్నారు. అయినా ఎన్నికల ముందు జరిగిన ఈ సంఘటనను ఖండిస్తూనో, మరోలాగానో స్పందించడం కంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడడమే బెటర్ అన్నట్లుగా ఇండ తెలుగు సినీ పరిశ్రమ వ్యవహరిస్తోందని విశ్లేషిస్తున్నారు.  జగన్ పై దాడికి ఖండిచి ఆయనకు అనవసర మైలేజీ ఇవ్వడమెందుకన్నట్లుగా మౌనంగా ఉండిపోయారంటున్నారు.

జగన్ పార్టీలో ఉన్న అలీ కూడా స్పందించిన దాఖలాలు లేవు. పార్టీ టికెట్ కోసం గత ఐదేళ్లుగా కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన అలీకి చివరకు జగన్ రిక్తహస్తమే చూపడంతో ఆయన పార్టీ వ్యవహారాలకు ఇటీవల కాలంలో దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద టాలీవుడ్ ప్రముఖులు, హీరోలు జగన్ విషయంలో స్పందించకపోవడం  వారు జగన్ పట్ల సానుకూలంగా లేరన్న సంకేతాలను పంపినట్లేనని అంటున్నారు.  

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.