వర్షాకాలంలో ఈ పని చేస్తే చాలు.. ఆమడదూరంలో అంటువ్యాధులు

Publish Date:Jul 15, 2024

Advertisement

వర్షపు రోజులలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. ఈ వాతావరణం  అనేక రకాల వైరస్‌లు,  బాక్టీరియాల పెరుగుదలకు అత్యంత అనుకూలమైనవి. ఈ సీజన్‌లో అంటు వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. అంటు వ్యాధులను నివారించడానికి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే  అలవాట్లు పెంపొందించుకోవడం ఎంతో అవసరం.  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం అనేది నిరంతరంగా సాగే ప్రక్రియ.  అయితే ప్రతిరోజూ ఈ రోగనిరోధక శక్తిని పెంపొందించడం అనేది ఉదయంతో ప్రారంభం కావాలి. దీంతో రోజు మొత్తం ఒక క్రమంలో పటిష్టమవుతూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.  ఈ వర్షాకాలంలో వచ్చే తీవ్రమైన అంటువ్యాధులను అరికట్టడానికి ప్రతిరోజూ ఉదయం ఒకే ఒక్క పని చేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కేవలం సాధారణ వైద్యులే కాదు.. ఆయుర్వేద నిపుణులు కూడా ఉదయాన్నే చేసే ఈ పనిని సమర్థిస్తున్నారు.

ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగమని అల్లోపతి నుండి ఆయుర్వేదం వరకు అన్నిరకాల వైద్యులు చెబుతున్న మార్గం. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఉదయాన్నే వేడినీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే..

వర్షాకాలంలో  ఫ్లూ ఇన్ఫెక్షన్ చాలా సాధారణంగా వచ్చే సమస్య.  పరిస్థితులలో ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నివారించవచ్చు. బరువు తగ్గడానికి అలాగే సాధారణ దగ్గు, జలుబు,  ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి గోరువెచ్చని నీటిని తాగడం ప్రయోజనకరంగా ఉంటుందని అన్ని వైద్యాలలో చెప్పబడింది. శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో గోరువెచ్చని నీటిని తీసుకోవడం  ప్రయోజనకరంగా పరిగణించబడింది. గోరువెచ్చని నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మం,  జీర్ణ సమస్యలకు చికిత్స చేయడం చాలా సులువుగా ఉంటుంది.

ముక్కులు మూసుకు పోతే..

ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌లో ముక్కు మూసుకుపోవడం అనే సమస్య అధికంగా ఉంటుంది. నిజానికి మొదట ముక్కులు మూసుకుపోవడంతోనే ఈ సమస్య మొదలవుతుంది. దీనికి నివారణ కావాలంటే  గోరువెచ్చని నీటిని తాగాలి. దీని వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. వేడి నీటిని తాగడంతోపాటు  తేలికపాటి ఆవిరిలో లోతైన శ్వాస తీసుకోవడం కూడా మంచిది. ఇది  సైనస్‌ సమస్యను  తొలగించడంలో సహాయపడుతుంది. ముక్కు లోపలి గోడలకు ఓదార్పు లభిస్తుంది.  వేడి పానీయాలు ముక్కు కారటం, దగ్గు, గొంతు నొప్పి,  అలసట నుండి త్వరగా, శాశ్వత ఉపశమనాన్ని అందిస్తాయి.

జీర్ణక్రియలో సహాయపడుతుంది..

వర్షాకాలంలో  జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు, వాతావరణంలోని తేమ కారణంగా శ్వాస సమస్యలు, జీర్ణసంబంధ సమస్యలు కూడా వస్తాయి.  గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వేడి నీరు  కడుపు,  ప్రేగులలో  కదులుతున్నప్పుడు, శరీర వ్యర్థాలను చాలా సులువుగా  బయటకు పంపుతుంది. వేడి నీటిని తాగడం జీర్ణవ్యవస్థను సక్రియం చేయడంలో, జీవక్రియను మెరుగ్గా  ఉంచడంలో ఒక భాగం. అంతే కాదు   కడుపు నొప్పి, కడుపు తిమ్మిరి, కడుపులో వికారం వంటి ఇతర సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగుతూ ఉంటే వర్షాకాలంలో ఎదురయ్యే ప్లూ, జలుబు, దగ్గు, శ్వాస సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

                                                        *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.