ఇది అనైతిక‌, అనారోగ్య రాజ‌కీయం.. సుజ‌నా చౌద‌రి 

Publish Date:Sep 21, 2022

Advertisement

ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్చ‌డం అంశంపై బుధ‌వారం అసెంబ్లీలో విప‌క్షం విరుచుకు ప‌డింది. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్‌.టి.రామావు హెల్త్ యూనివ‌ర్సిటీ క‌ల సాకారం చేయ‌ డానికి స్థాపించిన వ‌ర్సిటీకి ఆపేరు ఉండ‌డాన్ని అన్ని వర్గాల‌వారూ, అన్ని పార్టీల‌వారూ ఆమోదించార‌ని. అదే పేరుతో కొన‌సాగుతోంద‌ని ఇపుడు ఆ పేరు మార్చాల‌నుకోవ‌డం దారుణ‌మ‌ని తెలుగుదేశం స‌భ్యులు ఆగ్ర హించారు. 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చడం ఏపీ ప్రభుత్వ  అనైతిక, అనారోగ్య రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి  అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు తన తండ్రిపై అంత ప్రేముంటే ఏదైనా  కొత్త సంస్థను స్థాపించి దానికి ఆయన పేరు పెట్టుకుంటే ఎవరూ తప్పు పట్టరని అన్నారు. ఇలాం టి చర్యలు రాబోయే రోజుల్లో అనేక అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సుజనా చౌదరి అన్నారు.

కాగా,  బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ బుధవారం  మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు పిచ్చి బాగా ముదిరిందన్నారు. అధికార మదం తలకు ఎక్కి పేర్లు మార్పు చేస్తున్నారని మండి పడ్డారు. బుద్ధి, జ్థానం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ఆభిమా నులమని చెప్పుకునే వైసీపీ నేతల చర్య సిగ్గుచేటన్నారు. జగన్‌ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరకు వచ్చింది.. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు. ఎన్టీఆర్‌ పేరు తొలగింపుపై ప్రతి తెలుగువాడు తిరగబడాలని, ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేయా లని సీఎం రమేష్‌ పిలుపిచ్చారు.

అలాగే,  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి పీతల సుజా త మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు మార్చి యావత్ తెలుగుజాతిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోని జగన్రెడ్డి.. యూనివర్శిటీ నిధులు రూ.400 కోట్లు లాక్కు న్నారని ఆమె ఆరోపించారు. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించకపోతే.. జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. 

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు దుర్మార్గమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ,  అసలు అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  ఎక్కడ ఉన్నారని ప్రశ్నిం చారు. లక్షలాది డాక్టర్‌లు తయారయ్యే యూనివర్శిటీకి రౌడీ పేరు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయం మార్చుకోకపోతే  చరిత్ర కూడా క్షమించదని హెచ్చరించారు. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.