హెల్త్ ఇన్సురెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

Publish Date:Oct 14, 2025

Advertisement

 

నిన్నటి వరకు లైఫ్ ఇన్సురెన్స్ కు డిమాండ్ ఉండేది.  ఇప్పుడు వెహికల్స్ కు, ఇల్లు కొనుగోలుకు.. ఇలా అన్నింటికి ఇన్సురెన్స్ వచ్చింది.  అయితే ఈ ఇన్సురెన్స్ లు ఒక ఎత్తు,  హెల్త్ ఇన్సురెన్స్ ఒక ఎత్తు.  నేటి కాలంలో కుటుంబంలో ఎవరో ఒకరు ఏద ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా చాలా మంది హెల్త్ ఇన్సురెన్స్ మీద చాలా దృష్టి పెడుతున్నారు. వీటికి తగ్గట్టు ఇప్పట్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రమోషన్లు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి.  కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకునే ప్రతి ఒక్కరు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. అవేంటో తెలుసుకుంటే..

 హెల్త్ హిస్టరీ..

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకునే ముందు కుటంబంలో ఎంత మంది ఉంటే అంత మంది ఆరోగ్యం గురించి పూర్తీగా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా పూర్తీగా అందరి గురించి ఆలోచించుకుంటే మంచి ప్లాన్ ఎంచుకోవడానికి,  తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ కుటుంబ సభ్యుల ఆరోగ్య చికిత్సకు చక్కగా సహాయపడుతుంది.  అలా కాకుండా అందరూ ఎక్కువగా ఏది తీసుకుంటున్నారు? ఆర్థికంగా ఏది బాగుంది అనేవి చూసి తీసుకుంటే.. ఆ తర్వాత అది కుటుంబ సభ్యులకు ఉపయోగపడదు.

క్లెయిమ్ టైమ్..

ఆరోగ్య భీమాకు క్లెయిమ్ టైమ్ డేట్ ఉంటుంది.  ఈ గడుపు తేదీ తర్వాత మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి.  కాబట్టి పాలసీ క్లెయిమ్ కోసం వెయిటింగ్ డేట్ ను చెక్ చేసుకోవాలి.

సాధారణంగా కంపెనీలు ఈ వెయిటింగ్ పిరీయడ్ ను 30 రోజులుగా అమలుపరుస్తుంటాయి.  అయితే కొన్ని అనారోగ్యాలకు ఈ వ్యవధి చాలా ఎక్కువ అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకునే ముందు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

 సెటిల్మెంట్ పర్సెంటేజ్..

హెల్త్ ఇన్సురెన్స్ తీసుకునేటప్పుడు కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని చెక్ చేయాలి.  ఎక్కువ సెటిల్మెంట్ నిష్పత్తి ఉంటే తరువాత క్లెయిమ్ లకు దారితీయవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి.

ప్రీమియంతో తప్పటడుగు..

చాలామంది తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇలా తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీలు చాలా వరకు అంత మంచిగా ఉండవు.  ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉన్నా సరే.. అది ఆరోగ్య అవసరాలకు బాగా సహాయపడే ప్లాన్ ను మాత్రమే ఎంచుకుంటే బెటర్.

రిలెటెడ్ హాస్పిటల్స్..

హెల్త్ ఇన్సురెన్స్ ఏ కంపెనీ నుండి తీసుకుంటే.. ఆ కంపెనీ కి  రిలేటెడ్ గా ఉన్న హాస్పిటల్ లిస్ట్ ను తప్పనిసరిగా చెక్ చేయాలి.  ఇలా చేయడం వల్ల డబ్బు కట్టకుండా హెల్త్ ఇన్సురెన్స్ కింద ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం లభిస్తుంది. ఒక కంపెనీకి ఎక్కువ నెట్వర్క్,  హాస్పిటల్స్ లిస్ట్ ఎక్కువ ఉంటే అది బాగా సహాయపడగలుగుతుంది.

క్లెయిమ్ రూల్స్..

కొన్ని కంపెనీలు పేషెంట్ కనీసం 24 గంటలు హాస్పిటల్ లో చేరితేనే క్లెయిమ్ లను చెల్లిస్తాయి.  అలాంటి సందర్బాలలో ఆ అవసరాన్ని మినహాయించే  డే కేర్ సౌకర్యం ఉందా లేదా అనేది చూసుకోవాలి.

కండిషన్స్, రూల్స్..

హెల్త్ పాలసీ అయినా, జీవిత భీమా అయినా, వేరే ఇన్సురెన్స్ అయినా.. ఏదైనా సరే.. భీమాను కొనుగోలు చేసేముందు దాని కండిషన్స్,  రూల్స్ ను తప్పకుండా చదవాలి.  వాటిలో మినహాయింపులు,  రూల్స్ ను,  అలాగే పేమెంట్స్ ఇలా అన్ని అంశాలను కూడా చెక్ చేసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చాక మాత్రమే కొనుగోలు చేయాలి.

                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.