దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో.. బీజేపీ నేతృత్వంలోని, ఎన్డీయే కూటమి విజయం సాధించింది. స్పష్టమైన ఆధిక్యతతో దూసుకెడుతూ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై, ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎన్డీయే నిలిచిందన్న ఆయన.. అభివృద్ధి పట్ల ఎన్డీయేకు ఉన్న నిబద్ధతకు ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, గెలుపొందిన అభ్యర్థులకు చంద్రబాబు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/these-results-reflect-public-support-for-modis-policies-25-218913.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.