Publish Date:Jun 24, 2022
భయం నా బయోడేటాలో లేదు. నాది రాయలసీమ బ్లడ్.. పౌరుషం నా ఇంటి పేరు అంటూ లోకేష్ పల్నాడులో సింహ గర్జన చేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు లోకేష్ పల్నాడు పర్యటనకు ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా వాటన్నిటినీ అధిగమించి ముందుకే కదిలారు. పల్నాడు గడ్డపై నుంచి ఆయన అధికార పార్టీకి సవాళ్లు విసిరారు. విమర్శల తూటాలు పేల్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డిని జగన్మోసం రెడ్డిగా అభివర్ణించారు. గత ఎన్నికలకి ముందు జగన్ అన్నీ పెంచుకుంటూ పోతానన్నాడు జనం ఏమో సంక్షేమ పథకాలు పెం చుతూ పోతాడేమో అని ఆశపడ్డారు. సీఎం అయ్యాక ఆయన అన్నీ పెంచేశారు. అ
యితే అవి సంక్షేమ పథకాలు కాదు.. పన్నులు, చార్జీలు అన్నారు. అందుకే ఆయన జగన్ రెడ్డి కాదు ఆయన జగన్మోసం రెడ్డి అని లోకేష్ అన్నారు. తనను ఎవ రూ పీకలేరని విర్రవీగుతున్న జగన్‌రెడ్డి సెక్యూరిటీ లేకుండా బయటకొస్తే జనమే వెంట్రు కలన్నీ పీకి పంపుతారని నారా లోకేష్ హెచ్చరించారు. పల్నాడు జిల్లా రావలాపురంలో జల్లయ్య కుటుం బాన్ని పరామర్శించిన అనంతరం టిడిపి కార్యకర్తలని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే గంజాయి, పిచ్చి మందుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని అన్నారు.
రాష్ట్రంలో అసలు సిసలు పాలన, అభివృద్ధి తెలుగు దేశం వల్లే సాధ్యమవుతుందన్నారు. పసుపు జెండాని ప్రాణంగా ప్రేమించే తెలుగుదేశం కార్యకర్తలకి పాదాభివందనం. జగన్‌రెడ్డి పాలనలో రైతు ఆత్మహత్యల్లో ఏపీ ని మూడవ స్థానానికి చేర్చారన్నారు. ఈ మూడేళ్లలో పంటలకి గిట్టుబాటు ధర లేదు, ఏడాదికి ఇస్తామన్న మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి లేదు. రైతులకు భరోసా ఇవ్వలేకపోవ డమే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణమన్నారు. ఆడబిడ్డలకి న్యాయం చేయాలని నేను పోరాడితే అక్రమంగా అరెస్టు చేశారు..ఎన్నిసార్లయినా అరెస్టు చేసుకోండి. భయం నా బయోడేటాలో లేదన్నారు.
వైకాపా కుక్కలు నా మీద రాళ్లు వేయించాయి. రాళ్లు వేస్తే పారిపోను..నాది రాయలసీమ బ్లడ్..పౌరుషం నా ఇంటి పేరన్నారు. అమ్మ ఒడి మిగిలించుకోవడానికి పదో తరగతి పరీక్షల్లో నాలుగు లక్షల మందిని ఫెయిల్ చేసి విద్యార్ధులకు అన్యాయం చేశాడని జగన్ పై లోకేష్ ఘాటు విమర్శలు గుప్పించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/there-is-no-fera-in-my-bio-data-39-138353.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది