స్వరాజ్యం వెలుగుకు మొదటి నినాదం!!

Publish Date:Feb 11, 2022

Advertisement

 

ఈ ప్రపంచంలో భారతదేశానికి ఎంతో ప్రత్యేకస్థానం ఉంది. అది సంస్కృతి, సంప్రదాయాల పుట్టిళ్ళు. విభిన్న మతాల నిలయం. ఇంకా చెప్పాలంటే భరత ఖండంబు చక్కని పాడియావు అనే గొప్ప మాట ఉంది. అలాంటి భారతదేశంలో బ్రిటీషు వారి రాక, వారి దౌర్జన్యం చాలా నష్టాలను, కష్టాలను భారత పౌరుల దోసిల్లలో పోసిందని చెప్పవచ్చు.ఇలాంటి భారతదేశంలో మొదటిసారిగా సతీసహగమనం, బాల్యవివాహాలు, విద్య, అంటరానితనం వంటి ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి, స్వయం పరిపాలన కావాలని గొంతెత్తి చాటిచెప్పిన వాడు స్వామి దయానంద సరస్వతి.


ఈయన అందరికీ ఆర్యసమాజ స్థాపకుడిగా తెలుసు. భారతదేశంలో పౌరుల మనసులలో నుండి మూఢ నమ్మకాలు, అందవిశ్వాసాలను తొలగించడానికి  ఈయన చేసిన కృషి ఎంతో గొప్పది. సాదారణంగా 1857 సంవత్సరంలో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఆ నాటి పోరాటాలను మొదటి స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణిస్తారు చరిత్రకారులు. నాటి ఆ పోరాటంలో తనదైన కీలక పాత్ర పోషించి ఎందరో స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచినవాడు స్వామి దయానంద సరస్వతి.

భారతీయ ప్రత్యేకత అయిన వేదాలు ఉపనిషత్తులను ఎంతో బాగా తెలుసుకుని, వాటిని జీవితంలో భాగం చేసుకుని పాటిస్తూ మరొకవైపు సామాజిక శ్రేయస్సు కోసం కూడా పాటుపడిన అతి తక్కువ మందిలో ఈయన ఒకరు. సాదారణంగా వేదాలు ఉపనిషత్తులు అవపోషన పట్టిన వారు దేవుడు, దైవం, పుణ్యషేత్రాలు, ప్రచనాలు, భోధలు అంటూ గురువులుగా మారిపోతూ ఉంటారు. కానీ ఈయన మాత్రం బ్రిటీషు వారి బానిసత్వంలో నలుగుతున్న భారతాన్ని, విచ్చిన్న దశలో మూలుగుతున్న ఈ గొప్ప సంప్రదాయ దేశాన్ని చూసి ఎంతగానో చలించిపోయారు. ఈ భారతం ఇలా బానిసత్వాన్ని దాటుకుని, పాశ్చాత్యుల కుట్రల నిజాలు తెలుసుకుని అందులో నుండి బయటపడాలి అని ఆవైపుగా ఎంతో పోరాటం చేశారు.

ఆర్యసమాజ స్థాపన!!

భారతదేశానికి ఉన్న విలువలు ఎంతో గొప్పవి. అనుసరించే సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి. అయితే బ్రిటీషుల రాకతో భారతీయుల మెదళ్లలో హిందూ ధర్మం పట్లా, హిందూ దేవతల పట్లా ఒకానొక అపహస్యపు అస్త్రాలను మెల్లిగా విస్తరింపజేశారు. దానిపలితంగా కులాలు, మతాల చీలికలు. దేవతల వారిగా ప్రజలు కూడా వర్గాలుగా విడిపోయి తమలో తాము కొట్టుకుంటూ భారతీయ హిందూ ధర్మాన్ని విచ్చిన్నం వైపుగా తీసుకెళ్ళసాగారు.

ఈ పరిణామాలు అన్నిటినీ కళ్లెదురుగా చూస్తున్న స్వామి దయానంద సరస్వతి గారు ధర్మ సంస్థాపనను శాశ్వతంగానూ, దేశంలో ఉన్న ఎన్నో అవకతవకలను సంస్కరించడానికి. ముఖ్యంగా బాల్య వివాహాలు, విద్య, మూఢ నమ్మకాలు, అంటరానితనం, సతీసహగమనం వంటివాటిని అరికట్టాలనే ఉద్దేశంతో ఆర్యసమజాన్ని స్థాపించాడు. ఈ ఆర్యసమాజం నాటి నుండి ఇప్పటి వరకు కూడా భారతీయుల జీవితాల్లో భాగమై నాటి స్వామి దయానంద సరస్వతి కృషికి గుర్తుగా నిలిచి ఉంది.

మరణం వెనుక భయంకరమైన నిజం!!

కొందరు చేస్తున్న పనులు మరికొందరి స్వార్థానికి అడ్డుకట్టలు వేస్తుంటాయి.  స్వామి దయానంద సరస్వతి ఆర్యసామాజం నెలకొల్పి దాని సహాయంతో దేశాన్ని సంస్కరించడం మొదలుపెట్టాక చాలామంది తమ స్వార్థపూరిత కార్యకలాపాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే ఆయన్ను అడ్డు తొలగించుకుంటే తమ సమస్యలు తీరుతాయని  భావించి ఆయనకు విషప్రయోగం చేశారు. అయితే యోగాలో ఎంతో శక్తివంతమైన, మరెంతో రహస్యమైన బస్తి, న్యోలి అనే పద్ధతుల ద్వారా తన ప్రేగులను శుభ్రం చేసుకుని ఆ విషాల నుండి రెండు సార్లు బయటపడ్డారు స్వామి దయానంద. కానీ మూడవసారి మాత్రం ఆయన శరీరం విషానికి లొంగిపోయి క్షీణించి విశ్వం నుండి వీడ్కోలు తీసుకుంది.

ఇట్లా భారతీయ ప్రజానీకానికి పెద్దగా లోతుగా తెలియని స్వామి దయానంద కేవలం యోగి, ఋషి మాత్రమే కాదు భారతప్రజల కోసం స్వరాజ్యానికి పిలుపిచ్చిన మొదటి భారతీయుడు కూడా.

◆ వెంకటేష్ పువ్వాడ

 

By
en-us Political News

  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.