తెలంగాణలో ప్రశ్న పత్రాల లీకేజీల జాతర? రెండో రోజూ టెన్త్ ప్రశ్న పత్రం లీక్

Publish Date:Apr 4, 2023

Advertisement

తెలంగాణలో ప్రస్తుతం ప్రశ్నపత్రాల లీకేజీల జాతర నడుస్తోంది. పరీక్ష ఏదైనా. పేపర్ ఏదైనా, పోటీ పరీక్షలైనా, పబ్లిక్ ఎగ్జామ్స్ అయినా ప్రశ్నపత్రం లీక్ అయి తీరాల్సిందే అన్నట్లుగా పరిస్థితి విరాజిల్లుతోంది. ఇటీవల టీఎస్పీఎస్పీ ప్రశ్న పత్రాల లీకేజీ సృష్టించిన సంచలనం ఇంకా కొనసాగుతుండగానే.. టెన్త్ పరీక్షలు ప్రారంభమైన తొలి రోజు నుంచీ ఆ ప్రశ్న పత్రాల లీకేజీ మొదలైంది. తొలి రోజు సోమవారం టెన్త్ ప్రశ్నపత్రం లీకైంది.

వాట్సాప్ గ్రూపులో ప్రత్యక్షమైంది. ఇందుకు బాధ్యులుగా కొందరిపై చర్య తీసుకోవడమూ జరిగింది. పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం లేదు.. యథాతథంగా జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతలోనే మరో సంచలనం నమోదైంది. ఈ సారి ఏకంగా ప్రశ్న పత్రాలు లీక్ కావడం కాదు, విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు మాయమయ్యాయి. ఎలాగంటే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో టెన్త్ పరీక్ష రాసిన విద్యార్థుల ప్రశ్నపత్రాలు మాయమయ్యాయి.  

పరీక్షా కేంద్రం నుంచి ఓ ఆటోలో ఆన్సర్ పేపర్ల బండిల్స్ తరలిస్తుండగా..  పోస్టాఫీస్‌కు చేరుకునేలోపు అందులోంచి ఒక బండిల్ మిస్ అయింది. ఆ బండిల్‌లో దాదాపు 30 మంది విద్యార్థుల జవాబు పత్రాలు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఊట్నూరు మండల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇక మంగళవారం కూడా టెన్త్ పరీక్ష పత్రం లీకైంది. తొలి రోజు తెలుగు ప్రశ్న పత్రం లీకైతే.. రెండో రోజు హిందీ ప్రశ్నపత్రం లీకైంది. పరీక్ష ప్రారంభమై అరగంట గడిచిందో లేదో ప్రశ్నపత్రం వాట్సప్ లో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.

దీంతో తెలంగాణ ప్రభుత్వానికి అసలు  పరీక్షలు నిర్వహించే సత్తా ఉందా అని విపక్షాల ప్రశ్నిస్తున్నాయి టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ విపక్షాలు  పరీక్ష పత్రాల లీకేజీ సాధారణమే అన్నట్లుగా ఆయన మాట్లాడారని విమర్శిస్తున్నాయి. ఆయన మాటలకు తగ్గట్టుగానే తెలంగాణలో ప్రశ్న పత్రాల లీకేజీ జాతర జరుగుతోందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని విమర్శిస్తున్నారు.  

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.