వ్యతిరేక ఓట్లను చీల్చే పార్టీలకు స్వాగతం.. తెలుగు రాష్ట్రాల సీఎంల ఉమ్మడి వ్యూహం

Publish Date:Dec 16, 2022

Advertisement

ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు, అనివార్యంగా కనిపిస్తున్న ఓటమి నుంచి బయట పడేందుకు   పరస్పర సహకారంతో  ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా?  అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య సఖ్యత ఎంత మేరకు ఉందనేది అనుమానమే, అయినా, నువ్వొకందుకు పోస్తుంటే, నేనోకందుకు తాగుతున్నాను అనే స్నేహ బంధం అయితే వుందనేది  మాత్రం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే, ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు అవసరార్ధం చేతులు కలిపారని, ప్రతిపక్షాలు ఆరోపించడమే కాదు, ఆ ఇద్దరి నడక, నడతలను దగ్గరగా గమనిస్తున్న రాజకీయ పండితులు, విశ్లేషకులు సైతం అదే అంటున్నారు. 

నిజమే 2019 ఎన్నికల్లోనూ వైసేపీని గెలిపించేదుకు,కేసేఆర్ ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా మరీ ముఖ్యంగా ఆర్ధిక వనరులు సమకూర్చడంలో జగన్ రెడ్డికి సంపూర్ణ సహకరం అందించారు. అంతే కాదు, తెలుగుదేశం టికెట్ పై గెలిచి, తెరాసలో చేరి మంత్రి అయిన తలసాని శ్రీనివాస యాదవ్  ను తెలుగు దేశం పార్టీకు వ్యతిరేకంగా రంగలోకి దించారు. తెలుగు దేశం పార్టీలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే  పనికి తలసానిని ఉపయోగించారు. అందుకే  ఎన్నికల ఫలితాలు వచ్చి  జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే  ఆయన కేసేఆర్  చేతుల్లోకి వెళ్ళిపోయారనే ఆరోపణలు మొదలయ్యాయి. మరో వంక జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు కూడా అదే విషయాన్ని  స్పష్టం చేశాయి. 

అదేదో నాగార్జున సినిమాలో.. బ్రహ్మానందం,   ముందు ఆమె నన్ను ప్రేమించింది  ఆ తర్వాత నేను ఆమెను ప్రేమిచవలసి వచ్చింది అంటారు చూడండి, అలాగే, కేసీఆర్ వ్యూహత్మకంగా జగన్ రెడ్డిని ముగ్గులోకి లాగి ఉచ్చులో బిగించారని అంటారు. ముందు కేసీఆర్ జగన్ రెడ్డి దంపతులను హైదరాబాద్ కు ఆహ్వానించి, శాలువ కప్పి సన్మానం చేశారు. ఇక ఆతర్వాత ఏమి జరిగిందనేది  అందరికీ తెలిసిన విషయమే. ఆఫ్కోర్స్  అలాగని జగన్ రెడ్డి అమాయకుడు  కేసీఆర్ ఉచ్చులో చిక్కుకు పోయారు అనుకుంటే  అది పొరపాటే అవుతుంది. ఇంతకు ముందే అనుకున్నట్లుగా, ఇద్దరు ఇద్దరే, నువ్వొకందుకు పోస్తుంటే నేనోకందుకు తాగుతున్నాను, అన్నట్లు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వ ఆస్తులను, తెలంగాణ సర్కార్ కు సమర్పించి  అందుకు ప్రతిఫలంగా  హైదరాబాద్ లో తమ అక్రమ ఆస్తులను కాపాడు కోవడంలో  కేసీఆర్ ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నారని అంటారు. అయితే, ఇలా ఇద్దరు సార్ల మధ్య సాగుతున్న బేరసారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా ఆంద్ర ప్రదేశ్ ప్రయోజనాలు ‘క్విడ్ ప్రో కో’ టైపులో కొట్టుకు పోతున్నాయని అంటారనుకోండి అది వేరే విషయం. 

ఇక ప్రస్తుత ‘ప్యూర్’ పాలిటిక్స్ విషయానికి వస్తే, లక్ష్యం ఏదైనా కావచ్చును, తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కావచ్చును. కాదంటే, కాలం ఖర్మం కలిసోస్తే దేవెగౌడ లెక్క  ప్రధాని కావాలనే పగటికలల  ప్రభావమే కావచ్చును అదీ కాదంటే చుట్టుముడుతున్న అవినీతి ఆరోపణలు, సిబిఐ, ఈడీ దాడుల నుంచి రక్షణ పొందే వ్యూహమే కావచ్చును కారణం ఏదైనా తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా  ఏపీలో తెరాస నయా చహారా  బీఆర్ఎస్ కు రూట్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక్కడే మరోసారి, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల, ఉభయకుశలోపరి.. సంభాషణ మొదలైందని అంటున్నారు. 

అందులో భాగంగా ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు జగన్ రెడ్డి ... తెరాస నయా చహర.. భారత రాష్ట్ర సమితి (భారాస)కు స్వాగతం పలుకుతున్నారు. ఏపీ వ్యాప్తంగా బీఆర్ఎస్ కు మద్దతుగా స్వాగత బ్యానర్లు వెలుస్తున్నాయి. అటు విజయవాడలో ఆఫీసు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అన్నిటి వెనకా ఎవరున్నారో వేరే చెప్పనక్కరలేదు. ఇప్పటికే సజ్జల రామకృష్ణా రెడ్డి  భారాసకు స్వాగతం పలికారు. మిగిలిన విషయాలు ముఖ్యమంత్రులు ఇద్దరూ మాట్లాడుకుంటారని అన్నారు. అంటే ఆ ఇద్దరి మధ్య ఇప్పటికే ఒక అవగాహన ఉందని  సజ్జల చెప్పకనే చెప్పారు. నిజనికి ఇద్దరి మధ్య అవగాహన లేకుంటే  ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకునే  ‘రహస్యం’  ఏముంటుంది? అందుకే, ఓటమి నుంచి తప్పించుకునేదుకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్మడి కుట్రకు పాల్పడుతున్నారనే విషయం స్పష్టమవుతోంది పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అలాగే  తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు జగన్ రెడ్డి ఇప్పటికే సోదరి షర్మిలను బరిలో దించారు. ఇంతకాలం ఆమె ఎవరు విడిచిన బాణం అనే విషయంలో అనుమానాలున్నా, రీసెంట్ ఎపిసోడ్స్ లో ఆమె కేసీఆర్ కోసం జగన్ రెడ్డి వదిలిన బాణం అనే విషయం స్పష్టమైంది. అదొకటి అలా ఉంటే, ఇద్దరు ముఖ్యమంత్రుల ఉమ్మడి వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ  ఆమ్ ఆద్మీ పార్టీ, (ఆప్) సహా మరికొన్ని, ప్రభత్వ వ్యతీరేక ఓటును చీల్చే పార్టీలు నాయకులకు స్వాగత తోరణాలు సిద్దం చేస్తునట్లు తెలుస్తోంది. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో చెప్పకనే చెపుతోందని పరిశీలకులు అంటున్నారు. అందుకే, ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటై ఎన్ని వ్యూహాలు రచించినా, అక్కడ ఏపీలో వైసీపీ, ఇక్కడ తెలంగాణలో తెరాస ప్రభుత్వాలు ప్రభుత్వ వ్యతిరేక పవనాల్లో కొట్టుకు పోవం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. చూద్దాం. కథ అయిపోలేదు.. సశేషమే!

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.