తెలంగాణ సచివాలయంలో హై టెన్షన్: ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న బాధితులు.!

Publish Date:Sep 28, 2026

Advertisement

తెలంగాణ  సచివాలయంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివిధ విభాగాలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, అలాగే పలు అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సచివాలయ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. తమకు రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు.ప్రధానంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ వెలుపల ఈ ఆందోళన కార్యక్రమం జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమకు చెల్లించాల్సిన బిల్లులు నిలిచిపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళనకారులు వాపోయారు. పలుమార్లు అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదని, అందుకే నేరుగా సచివాలయానికి వచ్చి నిరసన తెలపాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు.

ఈ నిరసన కారణంగా సచివాలయంలోని ఒక్కసారిగా హైడ్రామా వాతావరణం నెలకొంది. భద్రతా సిబ్బంది  పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద భారీగా మోహరించిన భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ బకాయిలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బాధితులు కోరారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తాము దినదినం నరకం అనుభవిస్తున్నామని, ప్రభుత్వ పెద్దలు స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు తేల్చిచెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ, గత పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ఆలస్యం కావడంపై వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో అధికార వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. బకాయిల క్లియరెన్స్‌పై ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ఘటనతో సచివాలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అధికారులు సమస్య పరిష్కారం కోసం ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు.

 

 

 

[ Telangana Secretariat protest, Deputy CM Bhatti Vikramarka, retired employees protest,contractors protest, Telangana news, TeluguOne news ]
 

By
en-us Political News

  
గ్రేటర్   పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన  పలువురు  ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.  దానం నాగేందర్, వివేకానంద వంటి నేతల ఫిరాయింపులు పార్టీ కేడర్‌లో నిరుత్సాహాన్ని నింపాయి.
పదేళ్లుగా పక్కింటివారిలా పరిచయం.. మెల్లిగా చీటీలతో నమ్మకం సంపాదించారు.. ఆ నమ్మకంతోనే ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
పోయింది అధికారం మాత్రమే.. కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదు.!
గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి..!
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుండగా.. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్‌ చేశారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.
 శ్రీనాథ్  అవయవ దానంతో చావు అంచున ఉన్న ఆరుగురికి  పునర్జన్మ లభించింది. శ్రీనాథ్ కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ అధికారులు   కృతజ్ఞతలు తెలియజేశారు. తన అవయవదానంతో  సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి శ్రీనాథ్ మరణించిన తరువాత కూడా చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు.
తాడ్వాయి గురుకుల పాఠశాల విద్యార్థినులు పక్షుల కూతను బట్టి జాతిని గుర్తించే సరికొత్త ఎకో సెన్స్ బర్డ్ సౌండ్ డిటెక్షన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు.
తెలంగాణను ఇచ్చిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల సందర్భంగా  ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది గాయపడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా   1.24 లక్షల మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు తెలంగాణ డీజీపీ  సీవీ ఆనంద్   తెలిపారు.
. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో  తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. సీజన్ చివరి రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసి కొంత మేరకు ఉపశమనం కలిగించాయి గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన  వర్షాల కారణంగా వర్షపాతం లోటు ఒకింత తగ్గింది.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఘన నివాళులర్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.