తెలంగాణ సర్కార్ దిగొచ్చింది.. గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Publish Date:Jan 30, 2023

Advertisement

తెలంగాణ సర్కార్ కు తత్వంబోధపడి బొమ్మ కనిపించింది. రాజ్ భవన్ తో విభేదాల నేపథ్యంలో  గవర్నర్ ను విస్మరించి కార్యాలు చక్కబెట్టేయాలన్న ఉద్దేశంతో దూకుడుగా వ్యవహరించిన కేసీఆర్ ప్రభుత్వం.. చివరకు నాలుక కరుచుకుని అడుగు వెనక్కు వేయక తప్పలేదు. గవర్నర్ పై హై కోర్టు కు వెళ్లిన తెలంగాణ సర్కార్ తరువాత పిటిషన్ ను ఉపసంహరించుకుని వెనక్కు తగ్గి పరువుదక్కించుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ పై చేయి సాధించినట్లైంది.  

దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల విషయంలో ఉత్కంఠకు తెరపడింది. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతాయని తెలంగాణ సర్కార్ కోర్టుకు తెలియజేసింది. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతిస్తారని రాజ్ భవన్ పేర్కొంది. దీంతో ప్రతిష్ఠంభనకు తెరపడింది.  గత కొన్నేళ్లుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య అగాధం ఏర్పడిన సంగతి తెలిసిందే. గవర్నర్ తనకు ప్రొటోకాల్ ఇవ్వలేదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారంటూ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది.

పరస్పర విమర్శల విషయంలో  ఇరు పక్షాలూ కూడా తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరించాయి. ఇప్పటి వరకూ గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాల విషయంలో తెలంగాణ సర్కార్ పై చేయి సాధించినట్లు కనిపించినా చివరకు గవర్నర్ దే పై చేయి అయ్యిందని పించేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందుకు బడ్జెట్ సమావేశాలు కారణమయ్యాయి.

సంప్రదాయం ప్రకారం బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉండగా, తెలంగాణ సర్కార్ గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. గత సెషన్ ప్రోరోగ్ కానందున.. దానికి కొనసాగింపుగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయనీ, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండదనీ పేర్కొంది. అందుకు అనుగుణంగానే సమావేశాల షెడ్యూల్ కూడా ప్రకటించేసింది.

అయితే సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టాలంటే అందుకు గవర్నర్ అనుమతి తప్పని సరైన నేపథ్యంలో  తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుమతి కోరుతూ ఈ నెల 21న గవర్నర్ కు  బడ్జెట్ ఫైల్ ను   పంపింది.  అయితే అందుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు.. వరుసగా రెండో సారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్ కు ఎట్లా ఆమోదం తెలపాలని   ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ప్రశ్న సంధించారు.  తక్షణమే గవర్నర్ ప్రసంగం డ్రాఫ్ట్ పంపాలని కోరారు. అయితే అందుకు ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడంతో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది.

బడ్జెట్ సమావేశాల ప్రారంభ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం అనివార్యంగా హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం లంచ్ మోషన్ పటిషన్ దాఖలు చేసింది.  అయితే హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది, రాజ్  భవన్ తరఫు న్యాయవాదులు చర్చించుకుని ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వచ్చారు.    అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా గవర్నర్ పై విమర్శలు వద్దన్న సంగతిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాననీ విన్నవించారు. 

అలాగే బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇస్తారని రాజ్ బవన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో ఇరు పక్షాల న్యాయవాదుల అంగీకారంతో కోర్టు విచారణను ముగించింది. దీంతో బడ్జెట్ సమవేశాల విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభనకు తెరపడింది. అయితే బడ్జెట్ సమావేశాల ఫెడ్యూల్ మారే అవకాశాలు మాత్రం ఉన్నాయి.  

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.