ప్రైవేట్ టీచర్లకు సాయం ఇలా..
Publish Date:Apr 9, 2021
Advertisement
ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏప్రిల్ నుంచే సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దాదాపు 1.45లక్షల మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని అంచనా వేయగా.. వారికి సాయం కోసం నెలకు రూ.42కోట్లు అవసరమవుతాయని అధికారులు మంత్రులకు తెలిపారు. రేషన్ దుకాణాల వారీగా లబ్ధిదారులను గుర్తించాలని మంత్రుల సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లును మంత్రులు ఆదేశించారు. ప్రైవేటు టీచర్లకు సాయంపై ఈ సందర్భంగా మంత్రులు అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ సాయం అందేలా పకడ్భందీగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు వారి ఐడీ కార్డు, లేదా పాఠశాల వారు అందించే ఏదైనా ధ్రువపత్రంతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు, దరఖాస్తును జత చేసి కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని మొదట నిర్ణయించారు. ఆ పత్రాలను తనిఖీ చేసిన అనంతం అర్హులైన వారి ఖాతాలో డబ్బుల జమ చేయాలని భావించారు. వారికే రేషన్ షాపుల నుంచి బియ్యం అందించాలని చూశారు. అయితే ఈ రోజు మంత్రుల సమావేశంలో నిర్ణయించిన విధంగా రేషన్ షాపుల వారీగా అర్హులను గుర్తించనున్నారు. ఇలా అయితే సులువుగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించవచ్చని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే టీచర్లు, సిబ్బందికి తిరిగి పాఠశాలలు ప్రారంభించే వరకు నెలకు రూ. 2 వేలు, 25 కేజీల బియ్యం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ గురువారం ప్రకటించారు.ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందిని మానవీయ దృక్పథంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయం నేపథ్యంలో మంత్రులు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
http://www.teluguone.com/news/content/telangana-government-to-provide-assistance-to-private-teachers-and-staff-from-april-39-113428.html





