Publish Date:Apr 12, 2025
వరంగల్ వేదికగా శుక్రవారం జరిగిన జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. దాదాపు 23 వేల 238 ఈ జాబ్ మేళాకు హాజరు కాగా వీరిలో దగ్గరదగ్గర 5631 మందికి ఉద్యోగాలు లభించాయి.
Publish Date:Apr 12, 2025
దేశ వ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దాదాపు గంట సేపు ఈ సేవలన్నీ నిలిచిపోయాయి.
Publish Date:Apr 12, 2025
అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తేవాడొకడు అని సామెత. ఈ సామెత ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో ఏమో కానీ.. అప్పులు తెచ్చుకొనేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఓ బ్రోకరేజ్ సంస్థను పెట్టుకున్నదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన తాజా ఆరోపణ. ఆ ఆరోపణ నిజం అయితే మాత్రం ఆ సామెత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని అంటున్నారు.
Publish Date:Apr 12, 2025
భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో పట్టుకోసం చేసే ప్రయత్నాలు రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగానే సాగుతున్నాయి. అందుకే నాలుగు పదులకు పైబడిన ప్రస్థానంలో కేంద్రంలో వరసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చినా, తమిళనాడులో మాత్రం, ఒకటీ అరా సీట్లే కానీ అంతకు మించి మరో అడుగు వేయ లేక పోతోంది.
Publish Date:Apr 12, 2025
గాజు వంతెనలు, భారీ నిర్మాణాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే చైనా మరోసారి ఇంజినీరింగ్ అద్భుతం చేసింది. ఓ భారీ లోయపై రెండు మైళ్ల పొడవుతో వంతెనను నిర్మించింది. ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జ్‌గా నిలవనుంది.
Publish Date:Apr 12, 2025
సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్రిప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ను కాపాడింది భారతీయ కార్మికులే. ఇటీవల సింగపూర్ స్కూల్లో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
Publish Date:Apr 12, 2025
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై వివాదానికి పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలోనే మరణించారని తేల్చేశారు. ఈ మేరకు ఏలూరు రేంజి ఐజీ శనివారం ఈ విషయాన్ని విస్పష్టంగా చెప్పారు. శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాలది ఎంత మాత్రం హత్య కాదనీ, ఆయన రోడ్డు ప్రమాదంలోనే మరణించారనీ, సీసీ ఫుటేజీల ఆధారాలతో సహా తెలిపారు.
Publish Date:Apr 12, 2025
రోమ్ నగరం తగలబడి పోతుంటే ఇటలీ చక్రవర్తి ఫీడెల్ వాయించుకున్నారట.... ఇదో పాతకాలపు సామెత. ఇప్పుడు విశాఖలోని కొందరు కార్పొరేటర్లను చూసి ప్రజలు ఆ సామెతను గుర్తు చేసుకుంటున్నారు.
Publish Date:Apr 12, 2025
తిరుమలలో ఘోర అపచారం జరిగింది. తిరుమల ఆలయం మహాద్వారం వరకూ పాదరక్షలతో వచ్చిన ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
Publish Date:Apr 12, 2025
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, మరీ ముఖ్యంగా మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అందులో భాగంగా ఏపీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు టీడీపీ శ్రేణుల్లోనే అసంతృప్తి రగిలిస్తున్నాయి.
Publish Date:Apr 12, 2025
ట్రీ మేన్ ఆఫ్ ఇండియా వనజీవి రామయ్య ఇక లేరు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య.. పచ్చదనమే ప్రాణంగా… మొక్కలు పెంచడమే జీవితంగా బతికి వనజీవి రామయ్యగా గుర్తింపు పొందారు. ఆయన జీవితంలో కోటి మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Publish Date:Apr 11, 2025
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం శుక్రవారం (ఏప్రిల్ 11) కన్నుల పండువగా జరిగింది.
Publish Date:Apr 11, 2025
బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరణపై తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తీరు రాష్ట్రంలో బీఆర్ఎస్ సభలు, సమావేశాలూ నిర్వహించకూడదన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.