తెలుగువన్ ముందే చెప్పింది... బీఆర్ఎస్ లోకి తెలంగాణ మాజీ సీఎస్?

Publish Date:Apr 25, 2023

Advertisement

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారా?..  త్వరలో చేరబోతున్నారా?.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఆయన పార్టీలో చేరికకు దారి సుగమం అవుతోందనీ, అందుకే మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ వేదికపై ఆయనకు  చోటు లభించిందని విశ్లేషిస్తున్నారు. ఇక నుంచి ఆయన తెలంగాణ బయట జరిగే ప్రతి బీఆర్ఎస్ సభలోనూ ప్రముఖంగా కనిపిస్తారని అంటున్నారు.  ఔరంగాబాద్‌లో కేసీఆర్ అధ్యక్షతన సోమవారం (ఏప్రిల్ 14) జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభలో సోమేశ్ కుమార్ ప్రత్యక్షమయ్యారు. సభలో పాల్గొనడానికి కొన్ని నిమిషాల ముందు మహారాష్ట్ర పొలిటీషియన్ అభయ్ పటేల్ నివాసంలో జరిగిన సమావేశంలోనూ  ఆయన పాల్గొన్నారు.    బీఆర్ఎస్  వేదిక మీద సోమేశ్ కుమార్ కకనిపించడంఇదే మొదటి సారి. 

 

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వంలో కాదు, బీఆర్ఎస్ లో కీలక పదవి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని తెలుగువన్ ముందే చెప్పింది. ఆయనను బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలబెట్టే దిశగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని కూడా నాడే తెలుగువన్ అంచనా వేసింది.

సోమేష్ కుమార్ స్వరాష్ట్రం బీహార్ లో ఆయనకు బీఆర్ఎస్ బాధ్యతలు అప్పంచే అవకాశాలున్నాయనీ పేర్కొంది. ఆయన తెలంగాణ సీఎస్ గా రిలీవ్ అయ్యి.. ఏపీలో రిపోర్ట్ చేసిన సమయంలోనే తెలుగువన్  ఇక ఆయన అడుగురు రాజకీయంవైపే అని కుండబద్దలు కొట్టింది.

సర్వీస్ నిబంధనల ప్రకారం తెలంగాణలో రిలీవ్ అయిన వెంటనే రాజీనామా చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురౌతాయి కనుక ఏపీలో రిపోర్టు  చేసి అక్కడ పోస్టింగ్ తీసుకుంటరనీ, ఆ తరువాత తీరిగ్గా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని కేసీఆర్ వెంట రాజకీయ అడుగులు వేస్తారనీ నాడే తెలుగువన్ విస్పష్టంగా పేర్కొంది. ఇప్పుడు తాజా పరిణామాలను గమనిస్తే నాడు తెలుగువన్ చెప్పింది అక్షర సత్యం అని రుజువైంది.  

By
en-us Political News

  
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.