Publish Date:Nov 19, 2024
తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ పదవికి ఈటెల రాజేందర్ పేరు వినిపించినప్పటికీ ఆయన మల్కాజ్ గిరి లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో కేంద్రమంత్రి పదవి లభిస్తుందని అందరూ ఊహించారు. అయితే ఆయనకు కేంద్రమంత్రి పదవి వరించలేదు. బండి సంజయ్ కు ఈ పదవి వరించడంతో ఈటెల తీవ్ర నిరాశ చెందారు. ఇదే సమయంలో బిజెపి నూతన సారథి ఈటెల అని ప్రచారం జరిగింది. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాంచందర్ రావు బిజెపీలో సీనియర్ నేత. పార్టీలో ఆయనకు మంచి పేరు ఉంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి సంచలనం రేపారు. అంతేకాదు మల్కాజ్ గిరి ఎంపీగా రెండు సార్లు బీజేపీ తరుపున ఎన్నికల బరిలో నిలిచారు. ఈటెలకు బదులు డికె అరుణ, రఘునందన్ రావు పేర్లు కూడా వినిపించాయి. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన రాంచందర్ రావు నల్గొండ జిల్లా వాస్తవ్యుడు. చట్టాలపై మంచి అవగాహన ఉన్న రాంచందర్ రావు పార్టీకి విధేయుడిగా పేరు ఉంది. ఆయన గత లోకసభ ఎన్నికలలో మల్కాజ్ గిరిస్థానం నుంచి పోటీచేయాలనుకున్నారు. ఈటెల పేరు ఖరారు కావడంతో డ్రాప్ అయ్యారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-bjp-chief-n-ram-chander-rao-25-188642.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు