22A Lands: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.!

Publish Date:Sep 24, 2026

Advertisement

తెలంగాణలో భూముల కొనుగోళ్లు, అమ్మకాల ప్రక్రియను ఎంతోకాలంగా వేధిస్తున్న 22ఏ (నిషేధిత భూముల జాబితా) సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు పడుతున్న వేలాది మంది ఆస్తి యజమానులకు ఊరట కల్పించేందుకు రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న క్లిష్టమైన సమస్యలను లోతుగా అధ్యಯనం చేసి, వాటికి తక్షణ పరిష్కారాలు సూచించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక హైలెవల్ కమిటీని నియమించింది. ముగ్గురు సీనియర్ ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో లా సెక్రటరీ బి. పాపిరెడ్డి, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ స్పెషల్ సెక్రటరీ రాజీవ్‌గాంధీ హనుమంతు సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ ప్రధానంగా 22ఏ జాబితాలో చేరిన భూములకు సంబంధించి తలెత్తిన వివిధ రకాల వివాదాలు, చట్టపరమైన చిక్కులను పరిశీలించనుంది. ఇప్పటికే అధికారులు ఈ విభాగానికి సంబంధించి మొత్తం 12 రకాల కీలక సమస్యలను గుర్తించారు. చట్టపరమైన నిబంధనలకు లోబడి, ఏయే భూములను ఈ నిషేధిత జాబితా నుంచి తొలగించవచ్చనే అంశంపై ఈ హైలెవల్ కమిటీ కూలంకషంగా చర్చించి ప్రభుత్మానికి సిఫార్సులు చేయనుంది.

ముఖ్యంగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ లేదా ఇతర ప్రాధికార సంస్థల నుంచి పూర్తి అనుమతులు పొందినప్పటికీ, పొరపాటున 22ఏ జాబితాలో చేరిన ఆస్తులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి వాటికి సంబంధించి త్వరలోనే ప్రత్యేకంగా జీవోను కూడా జారీ చేయనున్నట్లు సమాచారం. గతంలో అనేక ప్రాంతాల్లో సరైన అవగాహన లేకుండా, లేదా సాంకేతిక లోపాల కారణంగా ప్రైవేట్ భూములు, ప్లాట్లు కూడా ఈ జాబితాలో చేరిపోయాయి. దీనివల్ల ప్రజలు తమ ఆస్తులను విక్రయించుకోవడానికి, బ్యాంకుల్లో రుణాలు పొందడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ తాజా నిర్ణయంతో ప్రజల కష్టాలు త్వరలోనే తీరుతాయని ఆశించవచ్చు. కమిటీ కేవలం నెల రోజుల వ్యవధిలోనే సమస్యలన్నింటినీ పరిష్కరించేలా గడువు విధించడం వల్ల, బాధితులకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

 

 

[ Telangana 22A lands, 22A prohibited lands, Telangana government high level committee, 22A land issues resolution, Revenue department Telangana, CM Revanth reddy, Minister Ponguleti Srinivasa Reddy ]
 

By
en-us Political News

  
రాజకీయ ఫిరాయింపులపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.!
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట లభించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సుప్రీంకోర్టు తీర్పుపై దానం నాగేందర్‌ స్పందించారు.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.
మాజీ డీఎస్పీ భీమ్ రెడ్డి కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు కీలక చర్యలు చేపట్టారు.
హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ దానం నాగుందర్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో  ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల నగారా మోగడం ఖాయమూంది.  
చారిత్రక  నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఈ రెండు విమానాశ్రయాల ద్వారా ఆయా ప్రాంతాల సాంస్కృతిక విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్యాకెట్‌ చూస్తే కొత్తదే.. కానీ అందులోని సరుకు మాత్రం గడువు ముగిసినదే. లాభాల కోసం కొందరు వ్యాపారులు వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
గణేష్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు..20 వేల మంది పోలీసులతో పహారా..!
ఎడమవైపు మినార్ కింద ఉన్న బాహ్య గోడ కొంతకాలంగా బలహీనపడటమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ఈ చారిత్రక కట్టడాన్ని మరింత పటిష్టపరిచేందుకు, దెబ్బతిన్న భాగాలకు శాశ్వత మరమ్మతులు చేపట్టే నిమిత్తం ఇప్పటికే టెండర్ ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని
వినాయక నిమజ్జనాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, హీరో నాని, దర్శకుడు ఓదెల శ్రీకాంత్ చేసిన విజ్ఞప్తులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.