Publish Date:Nov 25, 2024
వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఆశలను టీమ్ ఇండియా సజీవంగా నిలుపుకుంది. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్ లో 295 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఇంత దారుణంగా ఓడించిన జట్లు టీమ్ ఇండియా తప్ప మరొటి లేదేమో.
గవాస్కర్ -బోర్డర్ ట్రోపీలో భాగంగా రెండు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు నాలుగు రోజులకే ముగిసింది. ఈ టెస్టులో అన్ని విభాగాల్లోనూ టీమ్ ఇండియా ఆసీస్ పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగుల స్వల్ప స్కోరుకే ఔటయ్యింది. అయితే కెప్టెన్ బుమ్రా అద్భుత బౌలింగ్, సిరాజ్, రాణాల మంచి స్పెల్ తో ఆస్ట్రేలియా కుప్పకూలింది. కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో తొలి రోజే 17 వికెట్లు పతనమయ్యాయి. తొలి రోజు పేస్ కు బ్రహ్మాండంగా సహకరించిన పిచ్ ఆ తరువాత బ్యాటింగ్ కు స్వర్గధామంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యత సాధించిన టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఓపెనర్లు రాహుల్, యశశ్విజైస్వాల్ లు ఆసీస్ బౌలింగ్ అటాక్ ను ఓ ఆటాడుకున్నారు. 201 పరుగుల ఓపెనింగ్ పార్ట్ నగర్ షిప్ తో మ్యాచ్ ను ఆస్ట్రేలియా నుంచి లాగేసుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే జైశ్వాల్ మాత్రం తన ఫామ్ ను కొనసాగిస్తూ 161 పరుగులు సాధించారు. ఇక చాలా కాలంగా సెంచరీ కోసం మొహం వాచి ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన విశ్వరూపం చూపాడు. అలవోకగా ఆడుతూ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 30వ సెంచరీ కాగా.. మొత్తంగా అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 81వది.
దీంతో టీమ్ ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాకు 533 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను ఆదిలోనే టీమ్ ఇండియా బౌలర్లు చావు దెబ్బ కొట్టారు. మూడో రోజు టీ విరామ సమయం తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి కేవలం 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయింది. నాలుగో రోజు ఆట ఆరంభమైన తరవాత కూడా ఆసీస్ వికెట్ల పతనం కొనసాగింది. అయితు ట్రావిస్ హెడ్, మిఛెల్ మార్ష్ లు వికెట్ల పతనాన్ని అడ్డుకుని ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో హెడ్ 89 పరుగులు, మార్ష్ 47 పరుగులు చేశారు. ఆ తరువాత కేరీ కొద్ది సేపు క్రీజ్ లో నిలబడినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 239 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 295 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/team-india-outplay-australia-39-188932.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.