టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్...నారా లోకేష్ బయోగ్రఫీ

Publish Date:Apr 15, 2026

Advertisement

 

నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నారా లోకేష్ జీవిత విశేషాలు ఎలాంటివో పరిశీలిస్తే..లోకేష్‌ టీడీపీ పార్టీ జనానికి ఒక ఏడాది తర్వాత జన్మించారు. ఆయన  జన్మదినం 1983 జనవరి 23. అదే టీడీపీ 1982 మార్చి 29న ఆవిర్భవించింది. అంటే పార్టీతో సమానంగా ఆయన జీవితం ఎదుగుతూ వచ్చింది. 

ఇటు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడిగా, మరో సీఎం చంద్రబాబు తనయుడిగా లోకేష్ జీవితం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది.  ఇక తల్లి నారా భువనేశ్వరీ దేవి, సతీమణి బ్రాహ్మణి. లోకేష్ కి ఒక కొడుకు దేవాన్ష్. నారా లోకేష్ విద్యాభ్యాసం హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ లో సాగింది. గ్రాడ్యుయేషన్- అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్- ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆపై ప్రపంచ బ్యాంకులో పని చేసిన అనుభవం సైతం సాధించారు. 

ఇక రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. లోకేష్ నేరుగా పదవుల్లోకి రాకుండా, పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం తెరవెనుక పని చేస్తూ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంస్థాగత బాధ్యతలు ఎప్పుడు చేపట్టారో చూస్తే.. 2013లో పార్టీలోకి అధికారికంగా ప్రవేశించారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి ఇన్‌చార్జ్‌గా ఉంటూ, వేలాది మంది కార్యకర్తలకు బీమా, ఇతర సౌకర్యాలు అందేలా చూశారు. మంత్రిగా సేవల విషయానికి వస్తే.. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై, చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో గ్రామాల్లో LED లైట్ల ఏర్పాటు, సిమెంట్ రోడ్ల నిర్మాణం.. ఐటీ కంపెనీలను విశాఖపట్నం, అమరావతికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

2019లో అధికారం పోయాక.. మరీ ముఖ్యంగా తాను మంగళగిరిలో ప్రత్యక్ష ఎన్నికల్ల్లో ఓడిపోయాక.. నారా లోకేష్ లో తీవ్ర అంతర్మధనం మొదలైంది. తన బాడీ ఫిట్ నెస్ తో పాటు అన్ని అంశాల్లోనూ దృష్టి సారించారు. 2023లో యువగళం పాదయాత్ర మొదలు పెట్టారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలో ఒక మైలురాయి. కొన్ని అనివార్య కారణాల వల్లీ ఈ యాత్ర మధ్యలో ఆగినా దాని ఇంపాక్ట్ పార్టీలో, కేడర్లో చాలా పెద్దగానే ఉందని చెప్పాలంటారు విశ్లేషకులు.

2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి, ప్రస్తుతం విద్యా, ఐటీ, మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ పగ్గాలను చేపట్టారు. అసలు పార్టీ పరంగా ఇప్పటి వరకూ లోకేష్ ఏం చేశారో చూస్తే..  పార్టీ సభ్యత్వ నమోదును డిజిటలైజ్ చేయడంలో ఆయన కృషి అమోఘం. ప్రభుత్వ పరంగా పరిశీలిస్తే.. పంచాయతీ రాజ్ శాఖలో చేసిన సంస్కరణలకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇక ఎన్నికల విజయాల పరంగా చూస్తే.. 2019లో ఓటమి ఎదురైనా, పట్టు వదలకుండా ఐదేళ్ల పాటు అక్కడే ఉండి ప్రజలకు చేరువయ్యారు. 

2024లో అదే నియోజకవర్గంలో 90,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి తన సత్తా చాటారు. నారా లోకేష్ తన విద్యా నైపుణ్యం, ఆధునిక ఆలోచనా ధోరణితో పార్టీని భవిష్యత్ తరాలకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు చేపట్టడం పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.లోకేష్ తన పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టిందే కార్యకర్తల నుంచి. పార్టీకి ఇదెంత మేలు చేస్తుందంటే.. కార్యకర్తల సంక్షేమంలో లోకేష్ ది కీలక పాత్ర కాబట్టి. పార్టీ అంటే కార్యకర్త కాబట్టి.. ఎంతైనా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఈ నిర్ణయం కార్యకర్తకొక పండగ రోజుగా భావిస్తున్నారంతా.
 

By
en-us Political News

  
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.