ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సమన్యాయం

Publish Date:Mar 9, 2025

Advertisement


తమ కోటాలో సీట్లన్నీ బడుగలకే కేటాయించేసిన తెలుగుదేశం

అగ్రవర్ణాలకు నో ఛాన్స్..

అనూహ్యంగా తెర మీదకు బీజేపీ

అనుకున్నట్టే జరిగింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్ల ఖరారులో ఎవరూ ఊహించని ట్విస్టులు ఉంటాయని ఏ చర్చ అయితే జరిగిందో.. అదే తరహాలో ట్విస్ట్ ఇచ్చింది తెలుగుదేశం అధినాయకత్వం. పార్టీ  ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా నలుగురు ఉంటారనుకుంటే.. చివరి నిమిషంలో బీజేపీ ఓ సీటును ఎగరేసుకుపోయింది. దీంతో తెలుగుదేశం ఆశావహులకు గండిపడింది. ఇక  తెలుగుదేశం  అధిష్టానం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ పేర్లను ఖరారు చేసింది. మూడు స్థానాల్లో రెండు బీసీలకు.. ఒకటి ఎస్సీకి కేటాయించడం ద్వారా తాము పూర్తిగా బడుగులకే పెద్ద పీట వేస్తున్నామనే విషయాన్నిచాటి చెప్పింది. చివరి నిమిషంలో బీజేపీ ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని తన్నుకుపోవడంతో ఓసీలకు స్థానం కల్పించలేకపోయింది తెలుగుదేశం  అధినాయకత్వం. ఇక ప్రాంతాల వారీ కూర్పు విషయానికి వస్తే, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకూ ఒక్కో స్థానాన్ని కేటాయించినట్టు అయింది.

 వీటిల్లో బీదా రవిచంద్రయాదవ్ పేరు ముందు నుంచి ఊహించినదే అయినా.. బీటీ నాయుడు, కావలి గ్రీష్మ పేర్లు మాత్రం ఎవరూ ఊహించ లేదు. యాదవ సామాజిక వర్గానికి చెందిన బీదా రవిచంద్రకు పార్టీపై మంచి పట్టు ఉంది. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీకి సేవలందించారు. అలాగే వివిధ జిల్లాల్లో నేతలను సమన్వయం చేస్తూ ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా   ఎదిగిన బీదాకు అటు చంద్రబాబు వద్ద.. ఇటు లోకేష్ వద్ద కూడా మంచి పేరు ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను.. ఫిల్టర్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం బీదాకున్న ప్రత్యేకత. ఇక 2019-2024 మధ్య కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివిధ జిల్లాల బాధ్యతలు బీదాకు అప్పజెప్పారు. ఆయా జిల్లాలను ఓ కొలిక్కి తీసుకురావడంలో బీదా సక్సెస్ అయ్యారు. అలాగే  తెలుగుదేశం  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలిలో లోకేష్ మీద అప్పటి మంత్రి వెలంపల్లి దూసుకొచ్చే ప్రయత్నం చేసిన సందర్భంలో బీదా వెలంపల్లికి, లోకేషుకు అడ్డంగా నిలిచారు. ఈ క్రమంలో బీదాకు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం కచ్చితంగా వచ్చి తీరుతుందని భావించారు. అలాగే ఎమ్మెల్సీ సీటు బీదాను వరించింది.

 ఇక బీటీ నాయుడు. ఇప్పుడు ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో బీటీ నాయుడుది ఒకటి. 2009, 2014 ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు బీటీ నాయుడు. బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడుకు తిరిగి ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు చేసి.. కంటిన్యూ చేస్తున్నారు. బీటీ నాయుడును కంటిన్యూ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లినప్పుడు రాజమండ్రిలోనే బీటీ నాయుడు మకాం వేశారు. పైగా వృత్తి పరంగా బీటీ నాయుడు అడ్వకేట్. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో అడ్వకేట్ హోదాలో ప్రతి రోజూ చంద్రబాబును కలవడం, బయట జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, చంద్రబాబు పడుతున్న ఇబ్బందులు, చంద్రబాబు చేసిన సూచనలను బీటీ నాయుడు బాబు కుటుంబ సభ్యులకు, అవసరమైన మేరకు పార్టీ సభ్యులకు చెప్పేవారు. దీన్ని చంద్రబాబు దృష్టిలో పెట్టుకున్నారు. దీంతో బీటీ నాయుడుకు మరోసారి ఎమ్మెల్సీ స్థానం దక్కింది.

ఇక కావలి గ్రీష్మ. ఈమెకు ఎమ్మెల్సీ ఇస్తారనే చర్చ నామ మాత్రంగా కూడా పార్టీలో లేదు. కానీ ఆమె పేరును ఎవరూ ఊహించని విధంగా ఖరారు చేసింది పార్టీ అధిష్టానం. ఎస్సీ-మాల సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావడం ఆమెకు కలిసి వచ్చిన అంశం. అలాగే శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉన్న పరిస్థితులలు కూడా గ్రీష్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కేలా చేశాయి. రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీ వ్యవహర శైలిపై కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో రాజాం స్థానం కోసం కొండ్రు మురళీతోపాటు.. కావలి గ్రీష్మ కూడా పోటీ పడ్డారు. కానీ అప్పట్లో ఆ స్థానాన్ని కొండ్రరు మురళీకే కేటాయించింది అధిష్టానం. ఇప్పుడు అక్కడ పరిస్థితులను బేరీజు వేసుకుని.. అన్ని కోణాల్లో ఆలోచన చేసిన మీదట గ్రీష్మకు ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టారనేది ఓ చర్చ. ఇక ఈమెకు లోకేష్ టీం మెంబరుగా పేరు ఉంది. గతంలో ఓ మహానాడులో గ్రీష్మ స్పీచ్ తెలుగుదేశం కార్యకర్తలను ఉర్రూతులూగించింది.

 ఎమ్మెల్సీగా అవకాశం కల్పించలేకపోయిన ఆశావహులకు పార్టీ అధిష్టానం నుంచి ఫోన్లు వెళ్లాయి. ప్రస్తుతమున్న ఈక్వేషన్లల్లో భాగంగా ఈసారి అవకాశం కల్పించలేకపోతున్నామనే విషయాన్ని వారికి వివరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించలేకపోయిన వారికి.. భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులో లేక.. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించడమో చేస్తామని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ చివరి నిమిషంలో ఓ సీటును తీసుకోకపోయి ఉంటే.. ఓసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి స్థానం దక్కేది.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.