గత ఏడాది జరిగిన ఎన్నికలలో అద్భుత విజయంతో తెలుగుదేశం కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేపట్టింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తయ్యింది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం తొలి పరీక్షను ఎదుర్కొంది. అదే గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎనిమిది నెలల చంద్రబాబు ప్రభుత్వ పని తీరుకు ఈ ఎన్నికలు ఒక రిఫరెండంగా పరిశీలకులు అభివర్ణించారు.
పాలనా పరంగా గత జగన్ ప్రభుత్వం కంటే వేయి రెట్టు మేలు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నా, పరీక్షల వాయిదా విషయంలో గ్యాడ్యుయేట్లలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోందన్న వార్తల నేపథ్యంలో గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై తెలుగుదేశం కూటమిలో ఒకింత టెన్షన్ కనిపించిన మాట వాస్తవం. అలాగే ప్రభుత్వం ఏర్పడి ఇంత కాలమైనా, వైసీపీ హయాంలో అడ్డగొలుగా వ్యవహరించిన నేతలు, అధికారులపై చర్యల విషయంలో బాబు సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోందన్న అసంతృప్తి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పడుతుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యాపించారు. ముఖ్యంగా జీవీ రెడ్డి రాజీనామాతో పార్టీ క్యాడర్ లో అంసతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి.
వీటన్నిటికీ మించి గత ఏడాది ఎన్నికలలో ఉమ్మడి ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలో తెలుగు దేశం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఆ జిల్లాలలో వైసీపీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కలేదు.
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అదే స్థాయి విజయం సొంతం కావడంతో తెలుగుదేశం తొలి పరీక్షలో డిస్టింక్షన్ లో పాస్ అయ్యింది. ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజా రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ, వామపక్షాల మద్దతు ఉన్నప్పటికీ ప్రత్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ రావు ఏ దశలోనూ ఆలపాటికి కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఒక్క రౌండ్ లో కూడా మెజారిటీ సాధించలేకపోయారు. అదే విధంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తెలుగుదేశం అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుపై సునాయాస విజయం సాధించారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కు ప్రజామద్దతు బలంగా ఉందన్న విషయాన్ని తేల్చిచెప్పాయి. అంతే కాకుండా వైసీపీకి అంతంత మాత్రంగా ఉన్న స్థైర్యాన్ని కూడా పోయేలా చేశాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-kutami-sarkar-passed-in-distinction-39-193800.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.