ఆ ఇద్దరు కలిశారు.. ఇక ప్రభంజనమే!

Publish Date:Sep 16, 2023

Advertisement

అవును, లెక్కల్లో ఒకటికి ఒకటి కలిపితే ఖాయంగా అది రెండే..అవుతుంది. అది గణితం. కానీ, రాజకీయ, ఎన్నికల లెక్కల్లో మాత్రం అలాకాదు. సందర్భాన్ని బట్టి లెక్క మారిపోతుంది,. కుడికలు,తీసివేతలు, తీసివేతలు గుణితాలు అవుతాయి.  కొన్ని సందర్భాలలో ఒకటీ, ఒకటీ లెక్కల్లోలానే  రెండు కావచ్చు, ఇకొన్ని సందర్భాలలో  సున్నా కావచ్చు, ఇంకొన్ని సందర్భాలలో ఒకటీ ఒకటీ ... రెండు కంటే ఎక్కువ కావచ్చును. ప్లస్ ఇంటూగా మరి రెండు రెండ్లు నాలుగు ఇంకా ఎక్కవ కూడా కావచ్చును. 

అవును  మనం ఇప్పడు మాట్లాడు కుంటున్నది ఆంధ్ర ప్రదేశ్ లో వేగంగా మారుతున్న ఎన్నికల లెక్కలు, రాజకీయ గణితం  గురించే.  ముఖ్యంగా  తెలుగు దేశం అధినేత,రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు,మారుతున్న రాజకీయ సమీకరణాల గురించి ఇప్పుడు రాష్ట్రంలోనూ, దేశంలోనే కాదు  విదేశాల్లోనూ తెలుగు వారు  మాట్లాడుకుంటున్నారు. చర్చలు జరుగుతున్నాయి. 

మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముసుగులో గుద్దులాట లేకుండా, రేపటి ఎన్నికల్లో జనసేన తెలుగు దేశం కలిసి పోటీ చేస్తున్నాయని కుండ బద్దలు కొట్టిన తర్వాత ఏ ఇద్దరు తెలుగు వారు  గ్లోబులో ఎక్కడ కలిసినా ఇదే విషయం చర్చించుకుంటున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును కలిసిన అనతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జైలు బయట  జనసేన  తెలుగు దేశం పార్టీలు కలిసే ఎన్నికల బరిలో దిగుతాయని స్పష్టం చేశారు. అంతే కాకుండా  బీజేపీ కూడా కలిసి వస్తుందన్న విశ్వాసం కూడా పవన్ కళ్యాణ్  వ్యక్త పరిచారు. నిజానికి  ఈ ప్రకటన కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉభయ పార్టీల నాయకులు, కార్యకర్తలు అంటే కంటే ఎక్కువగా వైసీపే పాలనతో విసిగి పోయిన సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్  చేసిన సంచలన ప్రకటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగుదేశం, జనసేన పొత్తుపెట్టుకుంటే, ఇక వైసీపీ ఓటమిని ఆపడం ఎవరి తరం కాదనే భరోసాతో సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.  

నిజానికి  ఈ పరిణామాలతో సంబంధం లేకుండానే  రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక పవనాలు ఎప్పుడో జోరందుకున్నాయి. గడప గడపలో ఎదురైన వ్యతిరేకత, సక్సెస్ ఫుల్ గా సాగుతున్న తెలుగు దేశం  జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం  పాద యాత్ర,  చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వస్తున్న అద్భుత ప్రజా స్పందన గమనిస్తే, వైసీపీ సర్కార్ కు  రోజులు దగ్గర పడ్డాయనే, నిజం అందరికి అర్థమైంది. అప్పటి నుంచే  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతల వెన్నులో చలి మొదలైంది. ఆ భయంతోనే జగన్ రెడ్డి దింపుడు కళ్ళెం ఆశతో తప్పుడు కేసులో చంద్రబాబును అక్రమంగా ఇరికించి జైలుకు పంపారు. చంద్రబాబు సీన్ లో లేకుంటే  తెలుగు దేశం పార్టీ కకావికలం అవుతుందని  జగన్ కలలు కన్నారు.  

అయితే తానొకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలచాడు అన్నట్లుగా జగన్ రెడ్డి మాస్టర్  ప్లాన్ బూమ్ రాంగ్ అయింది.  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఒకటి చేసింది. మరో వంక బీజీపీ ఇంకా నిర్ణయం తీసుకోకున్నా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ  నడ్డా, కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, మరి కొందరు జాతీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు, అలాగే  ఉభయ తెలుగు రాష్ట్రాల బీజేపే అధ్యక్షులు పురందేపురందేశ్వరి, కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్, డాక్టర్ కే. లక్ష్మణ్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే .. కమలం మనసులో మాట స్పష్టమవుతూనే వుంది.  ఈ అన్నిటి కంటే ముఖ్యంగా ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు  చంద్రబాబు  జైల్లో  ఉన్నారనే మాటను జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ... వైసీపీ ప్రభుత్వానికి ఉద్వాసన పలకాలనే నిర్ణయానికి  వచ్చారు. ఇప్పడు తెలుగు దేశం, జనసేన పొత్తు ఖరారు కావడంతో .. . జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పే సుముహూర్తం  కోసం ఎదురు చూస్తున్నారు.  పొత్తుకు స్వాగతం పలుకుతున్నారు.  అ ఇద్దరు కలిస్తే, ఇక ప్రభంజనమే ..అంటున్నారు . అందుకే, జగన్ రెడ్డి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఇంకేం చేసినా అధికారం అందని ద్రాక్షేనని వారు అంతర్గత సంభాషణల్లో ఎలాంటి సందేహం లేకుండా చెప్పేస్తున్నారు. 

By
en-us Political News

  
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.