టీడీపీ నేతల అరెస్టులు.. రోడ్లపై జగన్ పార్టీ లీడర్లు! డీజీపీ.. వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంటా?
Publish Date:Oct 19, 2021
Advertisement
తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై దాడికి నిరసనగా ఆ పార్టీ ఇచ్చిన పిలుపుతో ఏపీలో బంద్ కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు జరగడం తీవ్ర ఉద్రిక్తత స్పష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. అన్ని జిల్లాల్లోనూ టీడీపీ ముఖ్య నేతలను అర్ధరాత్రి నుంచే గృహ నిర్బంధం చేశారు. ఇక రోడ్లపై నిరసనకు దిగుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లకు తరలిస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల నిరసనలతో హోరెత్తుతోంది. కనిగిరి బస్టాండులో టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే విశాఖ, శ్రీకాకుళం బస్టాండు దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో నిరసనగా దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒంగోలులో టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఏపీలో నిరసనల నేపథ్యంలో తెల్లవారు జామునుంచే బస్టాండ్లు, బస్సు డిపోల ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. అనుమానితులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలను ఇంతవరకు అరెస్టు చేయలేదని, న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తమను పోలీసులు బలవంతంగా చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా ఫైరవుతున్నారు. టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు... అధికార పార్టీ కార్యకర్తలను ఎందుకు వదిలేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. డీజీపీ.. వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మారిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. బంద్ కోసం వస్తున్న టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద టిడిపి పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు ఛౌదరి బాబ్జీతో పాటు పలువురు టిడిపి నేతలను అరెస్టు చేసి పోలీసులు. ఒంగోలులో బస్సులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. స్పాట్‌లో ఉన్న పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను అడ్డుకున్నారు. నేతలను, మహిళా కార్యకర్తలను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ సందర్భంగా పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య పెనుగులాట జరిగింది. అనంతరం అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
http://www.teluguone.com/news/content/tdp-call-ap-bundhu-police-arrets-hi-tention-25-124829.html





