జీఎస్టీ పేరుతో జనం నెత్తిన ధరల బండ!

Publish Date:Apr 28, 2023

Advertisement

దేశంలో అన్ని వస్తువుల,సేవల ధరలూ పెరిగిపోతూ వుంటే, దాని ప్రభావాన్ని తట్టుకుని భరించే స్థితిలో సామాన్య ప్రజలు లేరు. ప్రభుత్వాలు తాము పెంచుతున్న ధరలు కావచ్చు.. జిఎస్టీ కావచ్చు..గ్యాస్‌ కావచ్చు సామాన్యులకు భారం పడదన్న ధోరణిలో ఉన్నారు. నిజానికి ఏ వస్తువు అయినా ధరలు వెచ్చించి సామా న్యులు కొనాల్సిందే. ఏకీకృత పన్ను విధానం పేరుతో తీసుకుని వచ్చిన జిఎస్టీ ఇప్పుడు సామాన్యులకు గుదిబండగా మారింది. పాన్‌, ఆధార్‌ లింక కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారనుంది. దీనికి తోడు కనీసం వేయి రూపాయల ఛార్జీ వడ్డిస్తున్నారు. వారి ఆదాయాలు పెరగకుండా ధరల పెరుగుదల ను భరించే స్థితిలో ప్రజలు ఉన్నారా లేరా..అన్నది కూడా పాలకులు ఆలోచన చేయడం లేదు. శ్రామిక వర్గ ఆదాయాలు పెరిగే ధరలకు అనుగుణంగా పెరగగకుంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదు.

శ్రామిక వర్గం ఆదాయాలు పెరగవని, పెరగడం లేదని కూడా తెలుసు. భారమంతా శ్రామిక వర్గమే అంతిమంగా భరించాల్సి వస్తుందని కూడా పాలకులు తెలుసు. తెలిసి కూడా పెట్రో,గ్యాస్‌, జిఎస్టీ ధరల  అడ్డూఅదుపు లేకుండా పెంచేస్తున్నారు. ఇక సామాన్యుల ఇంటి కలను ఛిద్రం చేసేసారు. సామాన్యులు సొంతంగా ఇల్లు కల్లుకునే పరిస్థితి లేదు. మరోపక్క పేదవారి పట్ల పార్టీలు వేరైనా పాలకులంతా మొసలి కన్నీరు కారుస్తున్నారు. అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ, దేశీయంగా పెట్రో ధరలను పెంచి తీరాలన్న సూత్రం ఏదీ లేదు. కానీ అలా పెంచడం వల్ల ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తోంది.

పెట్రోల్‌ అన్నది ఇప్పుడు కేంద్రానికి ఆదాయవనరుగా మారింది. పెట్రో ధరల పెంపు అనేది ప్రభుత్వం అనుసరించే ద్రవ్య వ్యూహాన్ని బట్టి ఉంటుంది. ఈ ద్రవ్య వ్యూహాన్ని ప్రభుత్వం ఎప్పటి కప్పుడు మార్చుకునే వీలున్నా అందుకు కేంద్రం సిద్దంగా లేదు. పెట్రో ధరలను తమకు ఇష్టం లేకున్నా పెంచవలసి వస్తోందని వాపోవడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప మరోటి కాదు. పెట్రో ఉత్పత్తుల ధరలో దాదాపు సగం భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులకే పోతుంది. ఈ పన్నులకి, అంతర్జాతీయ చమురు ధరలకి సంబంధం లేదు. అయినా ఆ పన్నులను పెంచుకుంటూ పోతోంది. తన వంతు అదనంగా ప్రజల విూద కేంద్రంలోని వెూడీ ప్రభుత్వం భారాన్ని వెూపుతూనే పోతోంది. రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కొంత వరకూ అర్ధం చేసుకోవచ్చు.

వాటి పరిధిలో పరిమితమైన ఆదాయ వనరులే ఉన్నాయి. ముఖ్యంగా జి.ఎస్‌.టి విధానం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలు బాగా తగ్గిపోయాయి. పెట్రో ఉత్పత్తులు జిఎస్‌టి పరిధి లోకి రావు. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు పెట్రో ఉత్పత్తుల విూద పన్నులు వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యక్ష పన్నులు విధించే అధికారం లేనందువలన వాటికి వేరే దారి లేదు. కాని కేంద్ర ప్రభుత్వం వేరు. వేర్వేరు మార్గాల్లో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాని కావాలనే అది ఆ మార్గాలను ఉపయోగించడంలేదు.

సంపన్నుల విూద ప్రత్యక్ష పన్నులు విధించవచ్చు. ఆ సంపన్నుల పట్ల పక్షపాత వైఖరితో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రత్యామ్నాయాన్ని అది ఆలోచించడం లేదు. సంపన్న వర్గాలే పెట్రో ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తాయి గనుక పెట్రో ఉత్పత్తుల విూద ధరలు పెరిగితే వారి విూదే భారం ఎక్కువగా పడుతుందని ఎవరైనా భావిస్తే అది చాలా పొరపాటు. పెట్రో ఉత్పత్తులలో సామాన్య ప్రజలు నేరుగానే వినియోగిస్తారు. ఇందుకు ఉదాహరణ వంట గ్యాస్‌. ఇక పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగితే రవాణా చార్జీలు అనివార్యంగా పెరుగుతుంటాయి. దానితోబాటు వినిమయ వస్తువుల ధరలన్నీ పెరుగు తాయి. వాటిలో ఆహార ధాన్యాలతో సహా చాలా వస్తువులను ప్రజలే ఎక్కువగా వినియోగిస్తారు.

ఇక సంపన్నులు పెట్రో ఉత్పత్తులను వినియోగించి ఉత్పత్తి చేసే వివిధ రకాల సరుకుల రేట్లను పెంచి అమ్ముతారు. ఆ విధంగా కూడా అంతిమంగా వినియోగదారుల పైనే భారం అంతా పడుతుంది. అంతర్జాతీ యంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పుడు పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించు కోవడం కూడా అవసరమే. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచితే అపðడు వాటి వినియోగం తగ్గుతుంది. పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలని సామాన్య ప్రజలు మాత్రమే కోరుకుంటారు. ఎందుకంటే వారే నేరుగా బాధ్యలు కనుక. వినిమయం తగ్గితే మార్కెట్‌లో మాంద్యం మరింత పెరుగుతుంది. అది మరింత ఎక్కువ గా నిరుద్యోగానికి దారి తీస్తుంది. ఆ విధంగా ఒక వైపు ద్రవ్యోల్బణం, మరోవైపు మాంద్యం ఆర్థికంగా దెబ్బ తీస్తుంది. ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల పంపిణీని నియంత్రించి రేషనింగ్‌ విధానాన్ని అమలు చేయడం ద్వార కొంత నియంత్రించ వచ్చు.

నిజాయితీ ఉంటే ప్రత్యామ్నాయ ద్రవ్య విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడాలి. అది కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాలి. అపðడే ప్రజలపై భారం పడదు. నిజానికి ప్రజల నుంచి డబ్బులు గుంజడమెలా అన్నది కేంద్రం చేస్తున్న ఆలోచన.. జిఎస్టీతో ప్రజలు అల్లాడుతున్నా..పన్నులు కట్టలేక చస్తున్నా..పెట్రోల్‌ ధరలతో దాడులు చేస్తున్నా.. పట్టించు కోని ప్రధాని వెూడీ రాష్టాలు వ్యాట్‌ తగ్గించాలని గతంలో చేసిన సూచనలు ప్రజలంతా గమనిస్తున్నారు. వెూడీ వచ్చాక వివిధ రూపాల్లో జిఎస్టీ వసూళ్లు లక్షల కోట్లలో పెంచుకుంటున్నారు. కానీ ప్రజలపై పడుతున్న భారాలపై మాట్లాడడం లేదు. ఈ రోజు వరకు పెట్రోల్‌, డీజిల్‌ విూద ఒక పైస కూడా టాక్స పెంచలేదని సిఎం కెసిఆర్‌ ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. నిజానికి వెూడీ రాష్టాలను విశ్వాసంలోకి తీసుకుని ఏ అంశం పైనా చర్చించడం లేదు. నిజానికి విజన్‌ ఉన్న ప్రధానిగా..అంతా బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రధానిగా దేశానికి ఒరిగిందేమిటన్న ఆలోచనచేయడం లేదు. ప్రజలను విస్మరించి చేస్తున్న పాలన కారణంగా ప్రజలు నానా యాతన పడుతున్నారు. ఈ అంశాలపై విస్తృత చర్చ జరగాలి. ప్రజలు చైతన్యవంతులు కావాలి. అప్పుడే పాలకులు ఈ విధానాలను మార్చుకుంటారు.  వాస్తవానికి గత ఆరేళ్లుగా పెట్రో  ధరలపై ప్రధాని మోడీ చెబుతున్నవి అవాస్తవాలే.   చమురు కంపెనీలు ధరలు పెంచుతూపోవడమంటే.. అది ఒక్క పెట్రో ధరలతో ఆగిపోదు..  అనేక వస్తువుల ధరలు దాని ఫలితంగా పెరుగుతాయి. కాంగ్రెస్‌ హయాంలో పెట్రో ధరలపై విరుచుకు పడ్డ వెూడీ  ఇప్పుడు ఆ విషయం ఉద్దేశపూర్వకంగా విస్మరించారు.  

కేంద్రంపెట్రోల్‌పై ముందుగా ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించి,  ఆ తర్వాత వ్యాట్‌ తగ్గించమని రాష్టాలకు చెప్పివుంటే ఎంతో కొంత సబబుగా ఉండేది. వెూడీ అధికారంలోకి వచ్చాక లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.18 కిపైగా పెంచిందవి. యూపీఏ హయాంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.84 ఎక్సైజ్‌ డ్యూటీ ఉండగా.. వెూడీ దాన్ని రూ.27.90కు, లీటర్‌ డీజిల్‌పై రూ.3.56గా ఉన్న సుంకాన్ని రూ.21.80కు పెంచారు. వ్యాట్‌ తగ్గించమని రాష్టాలను కోరే ముందు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి చిత్తశుద్ది చాటుకుని ఉండాల్సింది. ఇదిలా ఉంటే సెంట్రల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్ రూపంలో లక్షల కోట్లు ఆదాయం వస్తున్న విషయాన్ని ప్రధాని ప్రజలకు చెప్పడం లేదు. ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రూ.26 లక్షల కోట్ల ఆదాయం వచ్చిన విషయాన్ని ప్రధాని ఎక్కడా ప్రస్తావించడంలేదు.  

జీఎస్టీ వసూళ్లలో రాష్టాల వాటాను సకాలంలో చెల్లించడం లేదు. కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని.. ఆ తర్వాత రాష్టాలు వ్యాట్‌ ని తగ్గించాలి. అప్పుడే పెట్రో ధరలు తగ్గి రవాణా ఛార్జీలు తగ్గుతాయి. దీంతో సరకు రావాణా భారం కూడా తగ్గుతుంది.  ప్రతిపక్ష పాలిత రాష్టాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయని, అక్కడి ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) తగ్గించకపోవడమే ఇందుకు కారణమని బిజెపి నేతలు నీతులు వల్లిస్తున్నారు. ఓ రకంగా పెట్రో ధరలపై రాష్టాలను అప్రతిష్టపాలు చేయాలన్న దురుద్దేశంగానే దీనిని చెప్పాల్సి ఉంటుంది.  

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.