Publish Date:Mar 26, 2026
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు. ఇప్పటికే ఐదేళ్ల పాలన తర్వాత డీఎంకే కూటమి ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకతకు తోడు, కొత్త పార్టీ రూపంలో విజయ్ విసురుతున్న సవాళ్లు సీఎం స్టాలిన్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే దీన్ని సొమ్ము చేసుకోవడంలో విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఏ మేరకు ముందుందన్న దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓట్ వైబ్ సంస్థ ఓట్ ట్రాకర్ పేరుతో నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్‌లో సంచలన విషయాలను వెల్లడించింది.
మీడియా ఛానల్ సీఎన్ఎన్-న్యూస్ 18కు విడుదల చేసిన ఓట్ వైబ్ ఒపీనియన్ పోల్‌లో ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో హోరాహోరీ ద్విముఖ పోరు తప్పదని తేల్చేసింది. డీఎంకే నేతృత్వంలోని అధికార కూటమి, విపక్ష అన్నాడీఎంకే కూటమి మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తేలింది. ఈ సర్వేలో 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్, సీపీఐ, మరియు సీపీఎంలతో కూడిన డీఎంకే కూటమి 113 నుండి 123 సీట్ల మధ్య గెలుచుకుంటుందని అంచనా వేశారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ప్రత్యర్థి అన్నాడీఎంకే కూటమి కూడా 106 నుంచి 116 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేశారు. విజయ్ కొత్త పార్టీ టీవీకే 2 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకుంటుందని అంచనా వేశారు..
అటు గత ఐదేళ్లలో డీఎంకే ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. దాదాపు 40% మంది ప్రభుత్వ పనితీరును మంచిది లేదా చాలా మంచిది అని చెప్పారు. దాదాపు 39% మంది దానిని "పేలవమైనది" లేదా చాలా పేలవమైనది గా చెప్పారు. పురుషులతో పోలిస్తే మహిళలు డీఎంకే ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారు. 55 ఏళ్లు పైబడిన ఓటర్లు అత్యధిక స్థాయిలో ప్రభుత్వపై సంతృప్తి వ్యక్తం చేయగా, 18-24 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లు కాస్త కోపంగా ఉన్నారు. సామాజిక వర్గాలలో, ఎస్సీ/దళితులు ప్రభుత్వాన్ని అత్యంత అనుకూలంగా చూస్తున్నారు. అయితే అగ్రవర్ణ హిందువులు అత్యంత అసంతృప్తితో ఉన్నారు.
మైనారిటీ వర్గాలు సగటు కంటే ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు. సీఎంగా స్టాలిన్ కు 39.9 శాతం మద్దతివ్వగా, అన్నాడీఎంకే నేత పళనిస్వామి 37.5%తో ఆయన వెనుక ఉన్నారు. పురుషులు పళనిస్వామికి మొగ్గు చూపుతుండగా, మహిళలు స్టాలిన్‌కు మద్దతు ఇస్తున్నారు. ప్రతిపక్ష మహిళా ఓటర్లు ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య చీలిపోయారు. యువ ఓటర్లలో, ముఖ్యంగా 18-24 ఏళ్ల మధ్య వయస్సు వారిలో విజయ్‌కు గణనీయమైన మద్దతు లభిస్తోంది. వయోవృద్ధ ఓటర్లు ఎక్కువగా స్టాలిన్‌కు మద్దతుగా నిలవగా, మధ్య వయస్కులు పళనిస్వామి వైపు మొగ్గు చూపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tamil-nadu-elections-39-216206.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.