విజ‌య్ గెలిచేస్తాడ‌ట‌...మంత్రుల జాబితా సిద్దం!

Publish Date:Apr 27, 2026

Advertisement

 

తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి. ఇక, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 

విజయ్‌ పాపులారిటీ, అనూహ్యంగా పెరిగిన పోలింగ్‌, ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం వంటి కారణాలతో.. టీవీకే ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇక, విజయ్ తన పార్టీ గెలుపుపై భారీగా ఆశలు పెట్టుకున్నారని.. ఆయన ఏకంగా మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే జాబితాను సైతం ఆల్రెడీ సిద్ధం చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.  ఇంత‌కీ ఈ జాబితాలో ఎవ‌రి పేర్లు ఉన్నాయి? అని చూస్తే..

బుస్సీ ఆనంద్. ఈయ‌న‌ టీవీకే జనరల్ సెక్రటరీ. ఈయన విజయ్‌కు అత్యంత సన్నిహితుడు, అంతేనా పార్టీ వ్యవహారాలన్నీ చూసుకునే వ్యక్తి. ఈయనకు అత్యంత కీలకమైన శాఖ- బహుశా హోం లేదా మున్సిపల్ శాఖ.. దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

ఆదవ్ అర్జున. ఈయన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందారు. ఈయనకు ఆర్థిక లేదా ఐటీ శాఖల బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది.కె.ఎ. సెంగోట్టయన్. గతంలో ఏఐఏడీఎంకే లో సీనియర్ మంత్రిగా పనిచేసిన ఈయన, విజయ్ పార్టీలో చేరడంతో ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక శాఖ ఇచ్చే అవకాశం ఉంది.

వేణుగోపాల్, మాజీ ఎంపీ. ఈయనకు కూడా సీనియారిటీ కోటాలో చోటు దక్కవచ్చని సమాచారం. కె.జి. అరుణ్‌రాజ్. పార్టీ సిద్ధాంతకర్త, ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది.మహిళా కోటా విష‌యానికి వ‌స్తే.. విజయ్ తన మంత్రివర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు, ఇందులో భాగంగా విజయలక్ష్మి వంటి మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి.

కేవలం అనుభవం ఉన్నవారినే కాకుండా, చదువుకున్న యువతను కూడా తన కేబినెట్‌లోకి తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పేర్లు కేవలం రాజకీయ విశ్లేషకులు, పార్టీ వర్గాల నుంచి అందుతున్న లీకుల ఆధారంగానే ప్రచారంలో ఉన్నాయి. మే 4వ తేదీన వెలువడే ఫలితాల తర్వాతే ఈ జాబితాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే తొంద‌ర ప‌డి ముందే కూసిన కోయిల‌లు త‌ర్వాత బొక్క బోర్లా ప‌డ్డం  కూడా ఉంది. గ‌త ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ త‌న పార్టీ వ‌ర్గాల వారిని ఒక హైప్ లో ఉంచ‌డానికిగానూ.. ప్ర‌మాణ స్వీకార వేదిక‌, హోట‌ళ్ల బుకింగ్ వంటి ఎన్నో ముంద‌స్తు ఏర్పాట్లు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అది కాస్తా తుస్సు మ‌న‌డంతో వైసీపీ కార్య వ‌ర్గ‌మంతా  డీలా ప‌డిపోయింది. 

అన్న‌ట్టు ఎన్డీయే కూట‌మి చంద్ర‌బాబును త‌మ తెలుగు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చూపితే, విజ‌య్ తాను జ‌గ‌న్ తో క‌ల‌సి దిగిన ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇప్పుడు చూస్తే ఆయ‌న‌లా ముంద‌స్తు జాబితాలు సిద్ధం చేయ‌డం వంటి హంగామా చూస్తుంటే ఇదేదో తేడాగా ఉందే అన్న అనుమానాలు కూడా వ‌స్తున్నాయ్. ఎందుకంటే ఏ స‌ర్వే కూడా విజ‌య్ కి 10- ప‌దిహేను సీట్ల కంటే ఎక్కువ వ‌చ్చేలా చెప్ప‌లేదు. అందుకే ఈ హంగామా చూస్తుంటే డౌట్ గా ఉందంటున్నారు కొంద‌రు.

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.