తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాల అమలు ఎప్పటి నుంచంటే?

Publish Date:Feb 26, 2025

Advertisement

ఐదేళ్ల జగన్ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ కు గత ఎన్నికలలో విముక్తి లభించింది. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా.. ఒకటనేమిటి.. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ పాలనపై ఆంధ్రప్రదేశ్ జనం తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేశారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా గట్టి బుద్ధి చెప్పారు. అలాగే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చెప్పే చంద్రబాబుకు పట్టం కట్టారు. ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. 
దీంతో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు.

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ ఆయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంపైనే దృష్టి పెట్టారు. జగన్ హయాంలో గుంతలమయంగా, అధ్వానంగా మారిన రహదారులను మెరుగుపరచడం, అస్తవ్యస్థం అయిపోయిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పెట్టుబడుల ఆకర్షణ వంటి విషయాలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులు ఓ మేరకు కుదుటపడ్డాయి అనుకున్న తరువాత ఆయన ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించారు. ముఖ్యంగా సూపర్ షిక్స్ హామీల అమలుకు దాదాపుగా షెడ్యూల్ ప్రకటించేశారు. ఇప్పటికే అంటే అధికార పగ్గాలు అందుకోగానే ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హీమీ మేరకు వృద్ధాప్య పింఛన్లను చెప్పినట్లుగా పెంచి మరీ ఇస్తున్నారు. అలాగే దీపం2 పథకం కూడా అమలులోకి వచ్చింది. అదే విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ ఉగాది నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. 

ఇక తాజాగా అసెంబ్లీ వేదికగా ఆయన మరో రెండు హామీల అమలును ప్రస్తావించారు. మే నెల నుంచీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద చదువుకుంటున్న పిల్లలు ఉన్న తల్లులందరికీ  ఎంత మంది పిల్లలు అన్న దానితో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకూ 15 వేల రూపాయలు అందించనున్నారు. 

అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ఈ మే నెల నుంచే ప్రారంభించనున్నట్లు అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులందరికీ ఏడాదికి 20 వేల రూపాయలు అందుతుంది. ఇందులో 14 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద కేంద్రం అందించే 6వేల రూపాయలు కూడా కలిపి మొత్తం 20 వేలు అందుతాయి. ఈ సహాయాన్ని మూడు విడతలుగా అందిస్తారు. నగదు నేరుగా రైతు ఖాతాలోనే జమ అవుతుంది. ఇక రాష్ట్రంలో మత్స్య కారులకు ఆర్థిక మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తారు.   

జగన్  హయాంలో ఆయన విధానాలు, ఆర్థిక అరాచకత్వం కారణంగా  రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలసిందే. బటన్ నొక్కడమే పాలన అన్నట్లుగా ఆయన సాగించిన అరాచక పాలన కారణంగా రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిపోయింది. 

అయితే సంక్షోభాలలోనే అవకాశాలు వెతుక్కోవాలని చెప్పే చంద్రబాబు.. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తరవాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంపై మొదటిగా దృష్టి సారించారు. ఇక నుంచి రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాన్ని జోడు గుర్రాళ్లా పరుగులెట్టించే దిశగా అడుగులు వేస్తున్నారు.  

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.